రెండు చేతులూ లేవు..పైలట్‌గా రికార్డ్‌! ఈమె గురించి తెలిస్తే, గూస్‌బంప్స్‌ ఖాయం!

The first ever Armless Licensed Pilot Jessica Cox success story - Sakshi

The Success Story Jessica Cox శరీరంలో ఏదైనా ఒక అవయవ లోపం ఉంటేనే  కృంగిపోతారు చాలామంది. కానీ  కొందరు మాత్రం ఎలాంటి  లోపం  ఉన్నాదాన్ని చాలెంజ్‌గా స్వీకరిస్తారు. అద్బుతమైన కృషితో పట్టుదలతో తామేంటే నిరూపించుకుంటారు. అలా  రెండు చేతులు లేకపోయినా పైలట్‌గా రాణిస్తోంది. జెస్సికా ప్రపంచంలోనే తొలి చేతులు లేని లైసెన్స్ పొందిన తొలి పైలట్‌గా చరిత్ర సృష్టించింది.వండర్‌ విమెన్‌ అమెరికాకు చెందిన జెస్సికా  కాక్స్‌  సక్సెస్‌ స్టోరీ గురించి తెలుసుకుందాం.

అరుదైన పుట్టుకతో వచ్చే  లోపం కారణంగా జెస్సికాకు పుట్టుకతోనే  నుండే రెండు చేతులు లేవు. అయినా ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు.అలాగే జెస్సికా కూడా రెండు చేతులు  లేకపోయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. లేని చేతుల గురించి బాధపడుతూ కూర్చోలేదు. తన రెండు కాళ్లే చేతులుగా మార్చుకుంది.రెండు కాళ్లతో సాధారణ ప్రజలు ఎలాంటి పనులు  చేసుకుంటారో  అంతే సునాయాసంగా  తానూ  అలవాటు చేసింది. కొన్నాళ్లపాటు కృత్రిమ చేతులు  ధరించినా ఆ తరువాత వాటిని కూడా తీసివేసింది. అరిజోనాలోని సియెర్రా విస్టాలో 1983లో జన్మించిన జెస్సికా తన పాదాలతో తన జీవితాన్ని గడపడం నేర్చుకుంది. చిన్నతనంలో, ఆమె తన సొంత పట్టణంలో నృత్యం అభ్యసించింది. 14 సంవత్సరాలు నృత్యం కొనసాగించింది. (ఉద్యోగానికి అప్లయ్‌ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!)

22 ఏళ్ల వయసులో పైలెట్‌గా శిక్షణ పొందింది. లెట్‌గా శిక్షణ పొందింది.కేవలం మూడు సంవత్సరాల్లో పైలెట్‌గా పూర్తి చేసింది. అంతేకాదు  ఈత కొట్టడం, డ్రైవింగ్ చేయడం (కారు), విమానం నడపడంలో ప్రావీణ్యం సంపాదించింది. 2008, అక్టోబరు 10న  జెస్సికా తన పైలట్ సర్టిఫికేట్‌ను పొందింది. ఆమె 10,000 అడుగుల ఎత్తులో తేలికపాటి క్రీడా విమానాన్ని నడిపేందుకు అర్హత పొందింది.2004లో, జెస్సికా మొదటిసారిగా రైట్ ఫ్లైట్ ద్వారా సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపింది. రెండు ముఖ్యమైన అవయవాలు లేనప్పటికీ  టైక్వాండోలో రెండు బ్లాక్ బెల్ట్‌లను కూడా సంపాదించింది. 2019లో, కాక్స్ నాల్గవ డిగ్రీ బ్లాక్ బెల్ట్    సాధించింది. అమెరికన్ టైక్వాండో అసోసియేషన్‌లో బ్లాక్ బెల్ట్ సంపాదించిన చేతులు లేని తొలి వ్యక్తి.   (మోడ్రన్‌ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్‌ దాకా మొత్తం లీక్‌: షాకింగ్‌ రిపోర్ట్‌)

జెస్సికా కాక్స్‌ అచీవ్‌ మెంట్స్‌
జెస్సికా  యునైటెడ్ స్టేట్స్‌లోని అరిజోనా విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో  డిగ్రీ పూర్తి చేసింది.
బ్రాండ్‌లారేట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ పర్సనాలిటీ అవార్డు
AOPA LIVE పైలట్స్ ఛాయిస్ అవార్డ్ 2010: జెస్సికా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన మహిళా ఏవియేటర్‌గా మారింది.
ఫిలిపినో ఉమెన్స్ నెట్‌వర్క్: 2009లో అమెరికాలో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన ఫిలిపినో మహిళల  జాబితాలో చోటు దక్కించుకుంది.
ది సక్సెస్ స్టోరీ జెస్సికా కాక్స్ 2009లో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్‌లో   కూడా  పబ్లిష్‌ అయింది. 

ఇదీ చదవండి: క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి!

 ఫిలిపినో అమెరికన్ జర్నల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ , 2008లో అత్యుత్తమ ఫిలిపినో అవార్డు లభించింది.
♦ ‘వైకల్యం అంటే అసమర్థత కాదు" అని రైట్‌ఫుటెడ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్  మిషన్‌ను ప్రచారం చేయడానికి తాను విమానాన్ని ఉపయోగిస్తానని ఆమె పేర్కొంది
♦ 2015లో కాక్స్ తన జీవితంలో నేర్చుకున్న పాఠం ద్వారా స్వంత సవాళ్లను అధిగమించడానికి ప్రజలను ప్రేరేపించేలా   డిసార్మ్ యువర్ లిమిట్స్ అనే  పుస్తకాన్ని రచించారు. దాదాపు 26 దేశాల్లో మోటివేషనల్‌ స్పీకర్‌  కూడా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top