గృహోపకరణాల విభాగంలోకి ఫినోలెక్స్‌ కేబుల్స్‌

Finolex Cables Launches Electric Iron Box To Enter Domestic Appliances Market - Sakshi

హైదరాబాద్‌: చిన్నపాటి గృహోపకరణాల విభాగంలోకి ఫినోలెక్స్‌ కేబుల్స్‌ అడుగు పెట్టింది. ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌ కేబుల్స్‌లో ప్రముఖ సంస్థగా ఉన్న ఫినోలెక్స్‌.. క్రీజ్‌ ఫ్రీ ఐరన్‌ శ్రేణిని (ఇస్త్రీ పెట్టె) విడుదల చేసింది. 750 వాట్‌ నుంచి 1600వాట్‌ సామర్థ్యంతో డ్రై, స్టీమ్‌ ఐరన్‌ బాక్స్‌లను తీసుకొచ్చింది.

అందుబాటు ధరకే, దీర్ఘకాలం పాటు మన్నే ఉత్పత్తులను కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంలో భాగమే నూతన శ్రేణి ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించడమని సంస్థ తెలిపింది. 25వేలకు పైగా అవుట్‌లెట్లలో ఇవి లభిస్తాయని, వచ్చే ఏడాది కాలంలో లక్ష స్టోర్లలో దేశవ్యాప్తంగా విక్రయానికి అందుబాటులో ఉంచుతామని ఫినోలెక్స్‌ కేబుల్స్‌ ప్రకటించింది.

చదవండి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top