భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌!

Amazon Founder Jeff Bezos Loses Over $670 Million In A Day - Sakshi

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ సంస్థ సీఈవో ఆండీ జెస్సీ 18వేల మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేస్తున్న ప్రకటించారు. ఆ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్‌లో అమెజాన్‌ షేర్‌ వ్యాల్యూ ఒక్క శాతం కోల్పోయింది. దీంతో బెజోస్‌ ఒక్క రోజే 670 మిలియన్‌ డాలర్లు నష్టపోయారు.  

రెండ్రోజుల క్రితం ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా అమెజాన్‌ ర్యాపిడ్‌గా ఉద్యోగుల్ని నియమించుకుంది. కానీ గత కొద్ది కాలంగా ఆర్దిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడింది. కాబట్టే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. 

బెజోస్‌ కొంపముంచిన ప్రకటన 
ఆ ప్రకటనే బెజోస్‌ కొంప ముంచింది. ఉద్యోగుల లేఆఫ్స్‌ ప్రకటనతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. స్టాక్‌ మార్కెట్‌లో అమెజాన్‌ షేర్లను అమ్ముకోవడంతో ఒక్కరోజే 600మిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. అమెజాన​ అధినేత బుధవారం ఒక్కరోజే 675 మిలియన్లు కోల్పోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 108 బిలియన్‌ డాలర్లు ఉండగా.. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు. 

కాలం కలిసి రావట్లేదా? 
గత కొద్ది కాలంగా బిలియనీర్ల జాబితాలో బెజోస్‌ తన స్థానాన్ని కోల్పోతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ.. అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ను వెనక్కి నెట్టారు. బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బెజోస్‌ను అధిగమించి రెండో స‍్థానాన్ని కైవసం చేసుకున్నారు. 

2022లో 
గతేడాది దిగ్గజ కంపెనీలకు ఏమాత్రం కలిసి రాలేదంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2022లో అమెజాన్‌ మార్కెట్‌ విలువ సుమారు 834.06 బిలియన్‌ డాలర్లు కోల్పోయింది. ఆ తర్వాత అమెజాన్‌ కంటే ఎక్కువగా టెక్‌ దిగ్గజం యాపిల్‌ 846,34 బిలియన్‌ డాలర్లు కరిగాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top