విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు డీలా | FDI inflows decline 13pc in April December 2023 | Sakshi
Sakshi News home page

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు డీలా

Mar 1 2024 7:12 AM | Updated on Mar 1 2024 10:58 AM

FDI inflows decline 13pc in April December 2023 - Sakshi

న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి 9 నెలల్లో(ఏప్రిల్‌–డిసెంబర్‌) 13 శాతం క్షీణించాయి. అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 32.03 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

ప్రధానంగా కంప్యూటర్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలకు ఎఫ్‌డీఐలు నీర సించాయి. గతేడాది(2022–23) ఏప్రిల్‌–డిసెంబర్‌లో 36.74 బిలియన్‌ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. అయితే ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌)లో 18% ఎగసి 11.6 బిలియన్‌ డాలర్లను తాకాయి.   

7 శాతం డౌన్‌: తాజా సమీక్షా కాలంలో ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్‌డీఐలు 51.5 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది తొలి 9 నెలల్లో లభించిన 55.27 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇవి 7 శాతం తక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement