రష్యాలో ఏమైంది..! దిగ్గజ టెక్‌ కంపెనీలపై వరుసగా...

Facebook Twitter Fined By Russia For Not Deleting Banned Content - Sakshi

మాస్కో:  అమెరికాకు చెందిన దిగ్గజ టెక్‌ కంపెనీలు ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు రష్యాలో మరోసారి షాక్‌ తగిలింది. నిషేధిత కంటెంట్‌ను తొలగించనందుకుగాను మంగళవారం రోజున ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు జరిమానా విధించింది. గత కొంతకాలంగా విదేశీ టెక్‌ కంపెనీలకు రష్యా ప్రభుత్వం జరిమానాలను విధిస్తూనే ఉంది. యుఎస్ ఆధారిత టెక్ కంపెనీలపై రష్యా ప్రభుత్వం నియంత్రణలను మరింత కఠినతరం చేస్తోంది. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఫేస్‌బుక్‌ జోక్యం చేసుకుందని గత వారం రష్యా  ఆరోపించింది.

చదవండి: గూగుల్‌కు సౌత్‌ కొరియా మొట్టికాయలు.. భారీ జరిమానాతో మరో ఝలక్‌

మాస్కో కోర్టు మంగళవారం ఫేస్‌బుక్‌కు సుమారు 21 మిలియన్ రూబిళ్లు (దాదాపు రూ. 2.12 కోట్లు) జరిమానా విధించింది. అదే కోర్టు ట్విట్టర్‌కు ఐదు మిలియన్ రూబిళ్ల (సుమారు రూ. 50 లక్షలు) జరిమానా వేసింది. రష్యాలో ఫేస్‌బుక్‌కు ఇప్పటివరకు 90 మిలియన్ రూబిళ్లు (సుమారు రూ. 9 కోట్లు), ట్విట్టర్‌కు  రూబిళ్లు 45 మిలియన్ల రూబిళ్లు (సుమారు రూ. 4.5 కోట్లు) జరిమానా విధించింది.

చట్టవిరుద్ధమైన కంటెంట్లను బూచిగా చూపిస్తూ..
రష్యా తరచుగా ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికన్‌ టెక్‌ కంపెనీలు ప్రవర్తిస్తున్నందుకు అక్కడి ప్రభుత్వం ఈ మేర చర్యలను తీసుకుంటుంది. చట్టవిరుద్ధమైన కంటెంట్లను బూచిగా చూపిస్తూ టెక్‌ కంపెనీలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ అతని మిత్రులతో సహా - సెప్టెంబర్ 17-19 తేదీలలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా రష్యా ప్రభుత్వం నిషేధించింది. వీరిపై ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో పోస్ట్‌లు వచ్చినందుకుగాను అక్కడి ప్రభుత్వం జరిమానాలను విధిస్తోందని తెలుస్తోంది.

ప్రభుత్వ  పాట వేరేలా..!
చట్టవిరుద్ధంగా లేబుల్ చేసిన కంటెంట్‌లపై, అశ్లీల అంశాలు,  డ్రగ్స్  ఆధారిత పోస్ట్‌లపై రష్యా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రష్యా ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. రష్యన్ వినియోగదారుల డేటాను తమ దేశంలో నిల్వ చేయడంలో విఫలమైనందుకుగాను దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌కు జరిమానాను విధించింది. ఎన్నికల్లో అమెరికా టెక్ దిగ్గజాల జోక్యంపై మాస్కోలోని అమెరికా రాయబారిని పిలిపించినట్లు రష్యా విదేశాంగ శాఖ గత వారం తెలిపింది.

చదవండి: ‘వీఐపీ’ల ఫేస్‌బుక్‌! ఎట్లపడితే అట్ల పోస్టులు.. నో యాక్షన్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top