పండగ పూట కిస్తీలతో కుస్తీ! | EMI Nation, How Buy Now, Pay Later Schemes Are Keeping India Festive Electronics And Smartphone Sales Afloat Amid Rising Prices | Sakshi
Sakshi News home page

పండగ పూట కిస్తీలతో కుస్తీ!

Oct 30 2026 10:07 AM | Updated on Oct 30 2026 10:27 AM

EMI Nation How Buy Now Pay Later Saved India Festive Tech Sales

పండగ సీజన్‌లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు వంటి గ్యాడ్జెట్లు కొనేందుకు వినియోగదారులు ప్రధానంగా అప్పులే చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెమొరీ చిప్‌ల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరగడం, రూపాయి మారకం విలువ క్షీణించడం, రవాణా ఖర్చులు పెరగడంతో ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 30% నుంచి 40% వరకు పెరిగాయి. ఈ రికార్డు స్థాయి ధరల పెరుగుదల వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయితే, సగటు కొనుగోలుదారుడికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అందిస్తున్న ఈఎంఐ, బై నౌ-పే లేటర్ సదుపాయాలు వస్తువుల విక్రయాలకు ఊపిరిపోస్తున్నాయి.

పెరిగిన ఈఎంఐ వాటా

దక్షిణాదిలో విస్తరించి ఉన్న ‘పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్’ సమాచారం ప్రకారం, గతంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో ఈఎంఐ వాటా 40-50% మాత్రమే ఉండగా ఈ పండుగ సీజన్‌లో అది ఏకంగా 70-80%కి పెరిగినట్లు ఆ సంస్థ డైరెక్టర్ రాహుల్‌పై తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా 181 స్టోర్లు ఉన్న ప్రముఖ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ డైరెక్టర్ నిలేష్ గుప్తా మాట్లాడుతూ, తమ పండగ సీజన్ అమ్మకాల్లో ఈఎంఐల వాటా 70-75% నమోదైందని స్పష్టం చేశారు. ఒకవేళ నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు అందుబాటులో లేకపోతే ఈ పండగ సీజన్‌లో ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు ఊహించని రీతిలో పడిపోయేవని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక మందగమనం, పెరిగిన ధరల భారాన్ని తగ్గించేందుకు శామ్‌సంగ్, వివో, ఒప్పో వంటి ప్రముఖ డిజిటల్ బ్రాండ్లు బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. గతంలో ఈఎంఐ చెల్లింపుల వ్యవధి 18 నుంచి 24 నెలలుగా ఉండగా ప్రస్తుత ఫెస్టీవ్‌ సీజన్ కోసం వినియోగదారులకు మరింత సమయాన్ని ఇస్తూ వ్యాపార సంస్థలు 30 నెలల వరకు సుదీర్ఘ కాల పరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి.

గృహోపకరణాలు అంతంతమాత్రంగానే..

అయినప్పటికీ, ఈసారి పండుగ ఆఫర్లలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాల కొనుగోలు మందకొడిగానే సాగుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాల సేల్స్ కూడా గతేడాదితో పోలిస్తే 10-12% తక్కువగా నమోదవడం కొనుగోలుదారుల సంకోచాన్ని స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి: కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement