షాకింగ్‌: ఇండియాలో రెండు ట్విటర్‌ ఆఫీసులు మూత

Elon Musk Shuts Twitter Offices In Delhi And Mumbai Sends Staff Home - Sakshi

సాక్షి,ముంబై: బిలియనీర్‌, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న తరువాత  ఖర్చులు తగ్గించుకునే పనిలో పలు నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్‌ తాజాగా న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసి వేశారు. భారతదేశంలోని తన మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసిన సంస్థ సిబ్బందిని ఇంటినుంచే పనిచేయమని కోరింది. మస్క్‌ యాజమాన్యంలో ట్విటర్‌ కోరింది. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగనుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది  

ఎలాన్మస్క్ కంపెనీని చేజిక్కించుకున్నప్పటినుంచి 90 శాతం ఉద్యోగులను తొలగించిన ట్విటర్ ఢిల్లీ, ముంబైలోని తన కార్యాలయాలను మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిలో 90శాతం మందిని తొలగించిన విషయం తెలిసిందే. 

2022లో ఉద్యోగుల భారీ తొలగింపుల తరువాత మస్క్ ఇప్పుడు ఆఫీసుల మూతకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగాఉద్యోగుల తొలగింపుల తోపాటు, కార్యాలయాలను మూసివేస్తున్నారు. భారతీయ మార్కెట్‌కు ప్రాధాన్యతనిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విటర్ బెంగళూరులో కార్యాలయాన్ని కొనసాగిస్తోందని, ఇది ప్రధానంగా ఇంజనీర్లతో పని చేస్తుందని వర్గాలు వెల్లడించాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top