ఆ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ ఎలాన్‌ మస్క్‌ను భయపెడుతోందా?

Elon Musk Now Fears Chinese Ev Maker Byd - Sakshi

ఈవీ కార్ల తయారీ విభాగంలో ఓ వెలుగు వెలుగుతున్న టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ను ప్రత్యర్ధి సంస్థ భయపెడుతోందా?  కాబట్టే టెస్లా కార్లకు పోటీగా సదరు కంపెనీ ఉందని మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా? అంటే అందుకు సమాధానం అవుననే వినిపిస్తోంది.  

2022లో ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో అత్యదికంగా అమ్ముడు పోయిన బ్రాండ్ల జాబితాలో టెస్లా తొలిస్థానాన్ని దక్కించుకుంది. టయోటా, హోండాలాంటి దిగ‍్గజ కంపెనీల కార్లను సైతం వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ మస్క్‌ చైనాకు చెందిన ఓ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్‌ కార్లు..టెస్లా కార‍్లకు, బ్రాండ్‌ను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని మస్క్‌ భావిస్తున్నారట? 

మస్క్‌ అభిప్రాయం మారింది   
ఓ 12 ఏళ్ల (2011లో) క్రితం బ్లూమ్‌ బెర్గ్‌ ప్రతినిధి ఎలాన్‌ మస్క్‌ను చైనా ఈవీ కార్ల తయారీ సంస్థ ‘బీవైడీ’ వాహనాల తయారీ, కార్ల డిజైన్‌ గురించి మస్క్‌ను ప్రశ్నించారు. ఆ కార్ల కంపెనీ గురించి తనని ప్రశ్నించడాన్ని మస్క్‌ జోక్‌గా తీసుకున్నారు. పెద్దగా నవ్వి ఊరుకున్నారు. అందుకు సదరు యాంకర్‌ ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా మీరు బీవైడీ కార్లు ఎలా ఉన్నాయో చూశారా? తన కార్లకు (టెస్లా)  బీవైడీ కార్లు పోటీకాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు బీవైడీ కార్లపై తనకున్న అభిప్రాయాన్ని మస్క్‌ మార్చుకున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

చదవండి👉రికార్డ్‌ల రారాజు.. ఎలాన్‌ మస్క్‌ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్‌

బీవైడీయే మా ప్రత్యర్ధి సంస్థ 
ఈ ఏడాది జనవరిలో టెస్లాకు అతిపెద్ద ఛాలెంజర్ ఏ కార్ల తయారీ సంస్థ అని అడిగినప్పుడు మస్క్‌ చైనా కంపెనీ అని మస్క్ పేర్కొన్నారు. కానీ ఆ కంపెనీ పేరు వెల్లడించలేదు. ‘వారు కష్టపడి, తెలివిగా పని చేస్తున్నారు. నేను ఊహించినట్లే చైనాకు చెందిన ఏదైనా కంపెనీ ఈవీ విభాగంలో టెస్లా తర్వాత రెండవ స్థానంలో ఉంటుందని చెప్పారు. ఆయన మాటల్ని ఊటంకిస్తూ ఎలాన్‌ మస్క్‌కు బీవైడీ కార్ల భయం పట్టుకుందంటూ పలు నివేదికలు సైతం వెలుగులోకి రావడం గమనార్హం 

ఎలాన్‌ మస్క్‌ మదిలో బీవైడీ కార్ల టెన్షన్‌
పదేళ్ల క్రితం బీవైడీ కార్లను జోక్‌గా తీసుకున్న మస్క్‌ ఇప్పుడు అదే కార్ల కంపెనీపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేయడం ఈవీ పరిశ్రమ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈవీ కార్ల అమ్మకాలతో పోలిస్తే టెస్లా కంటే బీవైడీ విక్రయాలు తక్కువే. అయినప్పటికీ  స్టార్టప్‌గా ప్రారంభమై నేడు టెస్లాకు గట్టి పోటీ ఇచ్చిన సంస్థగా ఎదిగిన వైనంపై డ్రాగన్‌ సంస్థ  ప్రశంసలందుకుంటుంది. ముఖ్యంగా హైబ్రిడ్‌, ఈవీ, న్యూఎనర్జీ వెహికల్స్‌ అమ్మకాలతో బీవైడీ అగ్రస్థానంలో నిలుస్తూ టెస్లాను వెనక్కి నెట్టేలా ఉందని ఈవీ నిపుణుల అంచనా   

కార్ల అమ్మకాలు పెరిగాయి
2022లో బీవైడీ ప్రపంచ వ్యాప్తంగా 1.85 మిలియన్ ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. వాటిలో 946,238 బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఉన్నాయి. అదే సమయంలో టెస్లా ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను డెలివరీ చేసింది.

చదవండి👉 ట్విటర్‌లో మస్క్‌ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top