
ప్రైవేటు రంగంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ ‘ఎస్‌ఐబీ గోల్డ్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో కొత్త బంగారం రుణ పథకాన్ని ప్రారంభించింది. బంగారం విలువపై 90% వరకు రుణాన్ని ఈ పథకం కింద పొందొచ్చు. రూ.25,000 నుంచి రూ.25 లక్షల వరకు రుణం, గరిష్టంగా మూడేళ్ల కాలానికి తీసుకోవచ్చు.
ఎంఎస్‌ఎంఈలు, నాన్ ఎంఎస్‌ఎంఈలు, చిన్న సంస్థలు తమ వ్యా పార విస్తరణ, మూలధన అవసరాల కోసం రుణాలు తీసుకోవచ్చని సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఎలాంటి రహస్య చార్జీల్లేకుండా, పారదర్శకంగా ఈ రుణ పథకం ఉంటుందని తెలిపింది. మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా పూర్తవుతుందని, మొదటిసారి రుణం తీసుకునే వారు కూడా అర్హులేనని పేర్కొంది.
ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..