
అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలకు సంబంధించి అత్యంత వేగంగా ఎదుగుతున్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని థర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రెసిడెంట్ టోనీ యాక్సియారిటో తెలిపారు. దేశీయంగా 2024లో 8.1 బిలియన్ డాలర్లుగా ఉన్న బయోఫార్మా రంగం 2030 నాటికి 15.9 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందనుందని బయోఫార్మా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.
ఈ నేపథ్యంలో తాము గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వేలీలో తలపెట్టిన బయోప్రాసెస్ డిజైన్ సెంటర్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఈ ఏడాది ఆఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని టోనీ చెప్పారు. భారత బయోఫార్మా పరిశ్రమ ప్రస్తుతం అధునాతన టెక్నాలజీలు, నిపుణులపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఇవి తోడ్పడగలవని ఆయన వివరించారు.