నవంబర్‌లో ‘మౌలికం’ పురోగతి 7.8 % | Eight core industries growth up at 7. 8percent in November vs 5.7percent year-ago | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో ‘మౌలికం’ పురోగతి 7.8 %

Dec 30 2023 5:39 AM | Updated on Dec 30 2023 5:39 AM

Eight core industries growth up at 7. 8percent in November vs 5.7percent year-ago - Sakshi

న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్‌ నవంబర్‌లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్‌ ఆయిల్, సిమెంట్‌ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. 

బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి.  ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్‌ వాటా దాదాపు 42 శాతం.

Advertisement
 
Advertisement
Advertisement