జూలై నాటికి డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు

Digital Bank Units are Ready to Open By 2022 July - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు (డీబీయూ) త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 75 జిల్లాల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, ఒక స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

డీబీయూలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ గత నెలలో విడుదల చేసింది. ఆర్‌బీఐ ఫిన్‌టెక్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ చౌదరి సారథ్యంలోని కమిటీ వీటిని రూపొందించింది. ఇందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సీఈవో సునీల్‌ మెహతా నేతృత్వంలోని వర్కింగ్‌ గ్రూప్‌ తోడ్పాటు అందించింది. డీబీయూలను ఏర్పాటు చేయతగిన 75 జిల్లాల జాబితాను రూపొందించింది. ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న పైలట్‌ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది.  ఆర్‌బీఐ కమిటీ మార్గదర్శకాల ప్రకారం డీబీయూలను బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లుగా పరిగణిస్తారు. ఇవి కనీస డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలు (రుణాలు, డిపాజిట్లకు సంబంధించి) అందించాల్సి ఉంటుంది.

చదవండి: ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా! టెక్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top