సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్‌ రిపోర్ట్‌

DGCA identifies lapses within Air India internal safety audit procedure - Sakshi

DGCA finds lapses in Air India టాటా నేతృత్వంలోని  ఎయిరిండియాకు భారీ షాక్‌  తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిరిండియా విమానాల్లో అంతర్గత భద్రతా ఆడిట్‌లలో లోపాలను కనుగొంది.ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు  డీజీసీఏ అధికారులు తెలిపారు. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో DRFలో లోపాలను ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్‌ తెలిపారు.కొనసాగుతున్న విచారణ కారణంగా, తాము వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు.

DGCAకి సమర్పించిన తనిఖీ నివేదిక ప్రకారం, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పైలట్లు ఆల్కహాల్ తీసుకున్నారా?లేదా?అనే పరీక్ష)కు సంబంధించి స్పాట్ చెక్‌ను నిర్వహించి నప్పటికీ, అంతర్గత ఆడిటర్ మాండేటరీ చెక్‌లిస్ట్‌ ప్రకారం వ్యవహరింలేదని, కొన్ని తప్పుడునివేదికలను అందించిందని టీం ఆరోపించింది. అలాగే క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్ అండ్‌ లోడ్ వంటి పలు అంశాల్లో క్రమం తప్పకుండా సేఫ్టీ స్పాట్ చెక్‌లను నిర్వహించాల్సి ఉంది, అయితే 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్‌లైన్ తప్పుడు నివేదికలు సిద్ధం చేసిందని రిపోర్ట్‌ చేసింది.  (లింక్డిన్‌కు బ్యాడ్‌ న్యూస్‌: కొత్త ఫీచర్‌ ప్రకటించిన మస్క్‌)

అయితే సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని నిరంతరం అంచనా వేయడానికి, మరింత బలోపేతం చేసుందుకు తాము ఇలా ఆడిట్‌లలో చురుకుగా పాల్గొంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సంబంధిత అధికారి లేవనెత్తిన ఏవైనా విషయాలను ఎయిర్‌లైన్ నేరుగా  పరిశీలిస్తుందన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top