
హైదరాబాద్: వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ పేటీఎం నగదు బదిలీపై ‘‘4 కా 100 క్యాష్‌బ్యాక్’’ ఆఫర్‌ను ప్రకటించింది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ మ్యాచ్ రోజుల్లో కస్టమర్లు పేటీఎం యూపీఐ ద్వారా నాలుగు రూపాయలు బదిలీ చేస్తే రూ.100 హామీ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 20 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, హర్భజన్ సింగ్‌లతో పాటు విండీస్ ఆటగాడు క్రిస్ గేల్‌లు ఆన్‌లైన్ ప్రచాకర్తలుగా వ్యవహరిస్తున్నారు.