19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! | Clemente Del Vecchio Worlds Youngest Billionaire | Sakshi
Sakshi News home page

Clemente Del Vecchio: 19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

Published Sun, Nov 26 2023 7:13 PM | Last Updated on Sun, Nov 26 2023 7:24 PM

Clemente Del Vecchio Worlds Youngest Billionaire - Sakshi

ప్రతి ఏటా మాదిరిగానే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా బిలియనీర్స్  కాబితాలో ఎక్కువగా సీనియర్ పారిశ్రామిక వేత్తలు ఉంటారని అందరికి తెలుసు. కానీ ఈ ఏట మాత్రం అందరి దృష్టి 'క్లెమెంటే డెల్ వెచియో' (Clemente Del Vecchio) పై పడింది. ఇంతకీ ఇతడెవరు? ఇతని సంపద ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

క్లెమెంటే డెల్ వెచియో వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇతడు బిలియనీర్ల కాబితాలో చేరిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేసాడు. 

నిజానికి క్లెమెంటే తండ్రి ఇటాలియన్ బిలియనీర్ 'లియోనార్డో డెల్ వెచియో'. ఇతడు ప్రపంచంలోనే అతిపెద్ద ఐ-గ్లాసెస్ (కళ్లద్దాలు) సంస్థ 'EssilorLuxottica' మాజీ చైర్మన్. ఈయన గతేడాది జూన్‌లో 87వ ఏట కన్నుమూశారు. ఆ తరువాత ఇతని ఆస్తి (25.5 బిలియన్ డాలర్లు) అతని భార్య, ఆరుగురు పిల్లలకు సంక్రమించింది.

తండ్రి ఆస్తిలో సుమారు 12.5 శాతం వాటాను వారసత్వంగా పొందిన క్లెమెంటే డెల్ వెచియో తన 18 సంవత్సరాల వయస్సులో బిలియనీర్ అయ్యాడు. ఫోర్బ్స్ ప్రకారం.. ఇతని సంపద 4 బిలియన్ డాలర్లుగా ఉంది (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30వేల కోట్ల కంటే ఎక్కువ).

ఇదీ చదవండి: ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు.. అగ్రగామిగా అంబానీ కంపెనీ!

క్లెమెంటే డెల్ వెచియో ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నప్పటికీ.. చదువు మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆసక్తి ఉన్న ఇతడు రాబోయే రోజుల్లో ఈ రంగంలోనే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం.

క్లెమెంటే డెల్ వెచియో ఇటలీలో అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో లేక్ కోమోలోని విల్లా, మిలన్‌లోని అపార్ట్‌మెంట్ వంటివి ప్రధానంగా చెప్పుకోదగ్గవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement