ఈప్యాక్‌లో.. చైనా కంపెనీ హైసెన్స్‌కు చోటు | China Hisense Invest To Epack Manufacturing Facility in India | Sakshi
Sakshi News home page

ఈప్యాక్‌లో.. చైనా కంపెనీ హైసెన్స్‌కు చోటు

Dec 27 2024 12:58 PM | Updated on Dec 27 2024 1:17 PM

China Hisense Invest To Epack Manufacturing Facility in India

కన్జూమర్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ ఈప్యాక్‌ డ్యూరబుల్స్‌ ఏర్పాటు చేయనున్న ప్లాంటులో చైనా సంస్థ హైసెన్స్‌ గ్రూప్‌ ఇన్వెస్ట్‌ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏసీలు, వాషింగ్‌ మెషీన్ల తయారీకి ఈప్యాక్‌ కొత్తగా ప్లాంటును నెలకొల్పుతోంది. ఈ ప్లాంటులో టీవీలు, అప్లయెన్సెస్‌ తయారీ చైనా కంపెనీ హైసెన్స్‌ గ్రూప్‌ 15 నుంచి 26 శాతం వాటా కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉంది.

అయితే భారత ప్రభుత్వ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలపై ఆధారపడి పెట్టుబడులకు వీలున్నట్లు హైసెన్స్‌ ఇండియా ఎండీ స్టీవెన్‌ లి తెలియజేశారు. ఈప్యాక్‌ ప్లాంటులో కనీసం 15 శాతం, గరిష్టంగా 26 శాతం వాటా కొనుగోలుకి అవకాశమున్నట్లు వివరించారు. నిబంధనలు అనుమతిస్తే భారత్‌లో పెట్టుబడులకు తమ గ్రూప్‌ కట్టుబడి ఉంటుందని తెలియజేశారు.

కంపెనీ దేశీయంగా తొలిసారి 120 అంగుళాల లేజర్‌ టీవీని ఇక్కడ విడుదల చేసింది. ఈ సందర్భంగా లి ప్రసంగిస్తూ వచ్చే వేసవిలో కొత్త శ్రేణిలో ఏసీలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఈప్యాక్‌ డ్యురబుల్స్‌ ఏసీలు, వాషింగ్‌ మెషీన్లను తయారు చేయనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలియజేశారు.

తొలి దశలో రూ. 250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించారు. కాగా.. ఈప్యాక్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీస్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్‌పీవీ ద్వారా ప్లాంటు నిర్వహణ ఉంటుందని 2025 అక్టోబర్‌కల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని లి వెల్లడించారు. భవిష్యత్‌లో దక్షిణాసియా, మెక్సికో మార్కెట్లకు హైసెన్స్‌ ద్వారా ఎగుమతులకు సైతం ప్లాంటు ఉపయోగపడనున్నట్లు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement