సెప్టెంబర్‌ నెలలో విడుదల కానున్న అదిరిపోయే 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ నెలలో విడుదల కానున్న అదిరిపోయే 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

Published Sun, Sep 3 2023 10:00 AM

check these top 5 smartphones to be launched in september - Sakshi

టెక్నాలజీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్‌ నెల వచ్చేసింది. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 15 సిరీస్‌ సైతం ఇదే నెలలో విడుదల కానుంది. ఇందుకోసం యాపిల్‌ సంస్థ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సెప్టెంబర్‌ 12న ఐఫోన్‌ 15 సిరీస్‌ లాంఛ్‌ కానుందని తెలుస్తోంది. ఆ సిరీస్‌ ఫోన్‌లతో పాటు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ, హానర్‌ 90, షావోమీ 13 టీ ప్రోలు లాంఛ్‌ చేయనున్నాయి ఆయా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు 

ఐఫోన్ 15 సిరీస్
సెప్టెంబర్ 12న యాపిల్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ‘వండర్‌లస్ట్‌’ ఫాల్‌ ఈవెంట్‌లో ఐఫోన్‌ 15, ఐఫోన్ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లు ఉన్నాయి. యూఎస్‌బీ-సీ పోర్ట్, పవర్‌ఫుల్‌ ఏ17 బయోనిక్‌ చిప్‌సెట్‌, లైనప్‌లో వినూత్నమన డైనమిక్ ఐలాండ్, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ మోడల్‌కు పెరిస్కోపిక్ కెమెరా లెన్స్‌ డిజైన్‌ వంటి ఈ ప్రీమియం మోడల్‌కి ఉంటాయని అంచనా. 

హానర్ 90 సిరీస్
దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు హానర్‌ సంస్థ సిద్దమైంది. చైనా  తయారీ సంస్థ హానర్‌ 2020లో భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఈ తరుణంలో హానర్‌ టెక్‌ పేరిట పున ప్రారంభం కానుంది. హానర్‌ 90 సిరీస్‌ను లాంచ్‌ చేసి భారత​ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో తాము సైతం పోటీలో ఉన్నామని చెప్పనుంది. హానర్‌ కొత్త సిరీస్‌ విడుదలపై అమెజాన్‌ ప్రచారం ప్రారంభించింది. మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తున్నారు. హైఎండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకి పెద్ద మొత్తంలో ఖర్చ చేయకూడదనుకునే వారికి ఈ ఫోన్‌ మంచిదని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్‌ విడుదల తేదీ అధికారంగా తెలియాల్సి ఉంది. 

షావోమీ 13టీ ప్రో
ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 1న లాంచ్ అవుతుందని గతంలో పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ విడుదల తేదీపై సస్పెన్స్‌ కొనసాగుతుంది. షోవోమీ 13టీ ప్రోలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200 ప్లస్‌ చిప్‌ సెట్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం 120 వాల్ట్‌ల ఛార్జింగ్‌ సపోర్ట్‌, 144హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లేతో రానుంది.  

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23
సుదీర్ఘ కాలం తర్వాత శాంసగ్‌ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌లోని బడ్జెట్‌ ఫోన్‌ త్వరలో విడుదల కానుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ పేరుతో మార్కెట్‌కు పరిచయం కానుంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ కెమెరా,ఎక్స్‌నాయిస్‌ 2200 లేదంటే స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 చిప్‌ సెట్‌, 120 హెచ్‌జెడ్‌ స్మూత్‌ డిస్‌ప్లేతో పాటు యూజర్లు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. 

వన్‌ ప్లస్‌ ఓపెన్‌ 
వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్‌ల ప్రపంచంలోకి వన్‌ప్లస్ ఓపెన్‌ అడుగుపెట్టనుంది. లాంచ్ తేదీ వెల్లడించనప్పటికీ ఇది 7.8-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, 6.3-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండొచ్చనే అంచనాలు నెకొన్నాయి. అంతేకాదు ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ఉండనుంది.

Advertisement
 
Advertisement