సీఏ మిస్‌కావడంతో ఫలితాలకు బ్రేక్‌

Chartered Accountant goes missing, company shelves its financials - Sakshi

బీఎస్‌ఈకి మైల్‌స్టోన్‌ ఫర్నీచర్‌ వివరణ

ముంబై: చార్టెడ్‌ అకౌంటెంట్‌ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్‌ ఫర్నీచర్‌ తయారీ కంపెనీ మైల్‌స్టోన్‌ ఫర్నీచర్‌ తాజాగా బీఎస్‌ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్‌కాల్‌లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్‌ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్‌లో పడినట్లు చైర్మన్‌ వెల్లడించినట్లు  మైల్‌స్టోన్‌ బీఎస్‌ఈకి తెలియజేసింది.

అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్‌ఈ, ఆర్‌వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top