Sakshi News home page

న్యూ ఇయర్‌ నుంచి చోటు చేసుకోనున్న మార్పులు ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!

Published Mon, Dec 18 2023 4:19 PM

Changes Coming Into Effect New Year From January 1,2024 - Sakshi

మరికొద్ది రోజుల్లో 2023 ముగిసి.. 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో రోజూవారి జీవితంతో ముడిపడి ఉన్న ఆర్ధికపరమైన అంశాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, స్టాక్‌ మార్కెట్‌ మార్కెట్‌, బ్యాంక్‌ లాకర్‌, ఆధార్‌లో మార్పులు వంటి అంశాలు ఉన్నాయి. 

అయితే, డిసెంబర్‌ 31 ముగిసి న్యూఇయర్‌లోకి అడుగు పెట్టిన అర్ధరాత్రి నుంచి చోటు చేసుకునే మార్పుల కారణంగా ఎలాంటి ఆర్ధికరపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే డిసెంబర్‌ నెల ముగిసే లోపు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాటిల్లో ప్రధానంగా 

డీమ్యాట్‌ అకౌంట్‌కు నామిని : మీరు ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తున్నా.. లేదంటే కొత్త ఏడాది నుంచి మొదలు పెట్టాలనే ప్రణాళికల్లో ఉంటే మాత్రం తప్పని సరిగా డీమ్యాట్‌ అకౌంట్‌లో నామిని వివరాల్ని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా పెట్టుబడిదారులు స్టాక్స్‌ను అమ్మాలన్నా, కొనాలన్నా.. సెక్యూరిటీస్‌ని అమ్మాలన్నా, కొనాలన్నా ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో చేసుకోవచ్చు. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 లోపు నామినీ వివరాల్ని అందించపోతే ఇకపై మీరు ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో చేసేందుకు అర్హులు, పైగా స్టాక్స్‌ను అమ్మలేరు, కొనలేరు. 

బ్యాంక్‌ లాకర్‌ అగ్రిమెంట్‌ : ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్‌ లాకర్‌ అగ్రమిమెంట్‌లో డిసెంబర్‌ 31,2023లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత బ్యాంకుల్ని సంప్రదించాలి. నిబంధనల్ని పాటించకపోతే లాకర్‌ ఫ్రీజ్‌ అవుతుంది. ఖాతాదారుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్‌బీఐ డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉంటుందని అంచనా.  

ఆధార్‌ కార్డ్‌లో మార్పులు : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌ కార్డ్‌లో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే ఉచితంగా చేసుకోవచ్చని సెప్టెంబర్‌ 14, 2023 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఆధార్‌ కార్డ్‌దారుల సౌలభ్యం మేరకు ఆ గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఆధార్‌లో మార్పులు చేసుకోవాలంటే రూ.50 సర్వీస్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 సర్వీస్‌ ఛార్జీ అంటే సులభంగా తీసుకోవద్దు. దేశంలో రోజూవారి కార్మికులు ఎంత సంపాదిస్తున్నారని తెలుసుకునేందుకు ప్లీటాక్స్‌ ఆనే సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో దినసరి కూలి రూ.178 అని తేలింది. కాబట్టే డిసెంబర్‌ 31 లోపు ఆధార్‌లో మార్పులు ఉంటే చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. 

సిమ్‌ కార్డ్‌లో మార్పులు : వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త సిమ్‌ కార్డ్‌ తీసుకోవడం మరింత సులభతరం కానుంది. ఇప్పుడు మనం ఏదైనా టెలికాం కంపెనీ సిమ్‌ కార్డ్‌ కావాలంటే పేపర్లకు పేపర్లలో మన వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపై ఈ ప్రాసెస్‌ అంతా అన్‌లైన్‌లోనే జరుగుతుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ (డాట్‌) తెలిపింది. 

కెనడాలో మారనున్న నిబంధనలు : ఈ నిర్ణయంతో జనవరి 1 నుంచి భారత్‌తో పాటు ఇతర దేశాల విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందే అని చెప్పుకోవాలి. కెనడాలో చదువుకునేందుకు స్టడీ పర్మిట్‌ కావాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్ధుల వద్ద 10వేల డాలర్లు ఉంటే సరిపోయేదు. కానీ జనవరి 1,2024 ఆ మొత్తాన్ని 20,635 డాలర్లకు పెంచింది. ఈ నిబంధన జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం  తెలిపింది.

Advertisement

What’s your opinion

Advertisement