Cryptocurrency: మేం ఎవరి డేటా కలెక్ట్‌ చేయడం లేదు

Central Govt Not Collect Data Information On Cryptocurrency Says Fm Nirmala Sitharaman - Sakshi

మనదేశంలో డిజిటల్‌ కరెన్సీని దశలవారీగా అమలు చేసే అంశంపై ఆర్బీఐ కసరత్తులు చేస్తోంది.ఇప్పటికే హోల్‌సేల్,రిటైల్‌ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి.రవిశంకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో దేశంలో క్రిప్టో కరెన్సీపై తలెత్తున్న అనుమానాలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్‌ చెక్‌ పెట్టారు. 

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్‌ మోడీ మాట్లాడుతూ..దేశంలో క్రిప్టో మార్కెట్‌,వినియోగదారులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు కేంద్రం డేటా కలెక్ట్‌ చేస్తుందా? అన్న ప్రశ్నలకు నిర్మలా సీతారామన్‌ స్పందించారు.మనదేశంలో క్రిప్టో కరెన్సీ వినియోగం గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు, ఎవరి డేటా కలెక్ట్‌ చేయడం లేదు.ఎవరైనా క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే నార‍్కోటిక్‌ డ్రగ్‌ ట్రాఫికింగ్‌,మనీ ల్యాండరింగ్‌ విభాగం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.     

ఇక ఇన్వెస్టర్లు ఎవరైనా విదేశాల నుంచి క్రిప‍్టోను భారత్‌కు తీసుకువస్తే వారి నుంచి ఈక్వలైజేషన్ లెవీని కట్టించుకోమని స్పష్టం చేశారు.ఈక్వలైజేషన్‌ లెవీ (ట్యాక్స్‌) కేవలం ఈకామర్స్‌ సంస్థలకు వర్తిస్తుందని, ఇన్వెస్టర్లు వర్తించదని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 

ఈక్వలైజేషన్‌ లెవి( ట్యాక్స్‌) అంటే? 

ఉదాహరణకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌కి ఇండియాలో సబ్‌ స్క్రిప్షన్‌ మీద 10 కోట్లు లాభాలు వచ్చాయంటే..అందుకు నెట్‌ ఫ్లిక్స్‌ కేంద్రానికి రూ.20లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే ముందే ఈక్వలైజేషన్‌ లెవి నిబంధనలు మేరకు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఒప్పుకోకపోతే నెట్‌ ఫ్లిక్స్‌ సర్వీస్‌లను మనదేశంలో కొనసాగించే అవకాశం లేదు. ఇదే అంశం క్రిప్టోకరెన్సీకి వర్తిస్తుంది.

చదవండి : అలర్ట్‌: యోనో యాప్‌ వినియోగిస్తున్నారా?! ఇది మీకోసమే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top