బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది: ధర ఎంతో తెలుసా? | BYD Sealion 7 EV Launched in India Price Features and Range Details | Sakshi
Sakshi News home page

బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

Feb 17 2025 3:45 PM | Updated on Feb 17 2025 3:59 PM

BYD Sealion 7 EV Launched in India Price Features and Range Details

బీవైడీ కంపెనీ తన 'సీలియన్ 7' (Sealion 7) ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు రెండు వేరియంట్లలో.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సరికొత్త బీవైడీ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బీవైడీ సీలియన్ 7 కారు ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు వరుసగా.. రూ. 48.9 లక్షలు, రూ. 54.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). జనవరి ప్రారంభంలోనే కంపెనీ ఆ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మార్చి 7 నుంచి ప్రారంభమవుతాయి.

కొత్త డిజైన్ కలిగిన బీవైడీ సీలియన్.. క్రాస్ఓవర్‌ మాదిరిగా ఉంటుంది. ఇది వాలుగా ఉండే రూఫ్‌లైన్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్‌ వంటివన్నీ 'బీవైడీ సీల్'ను పోలి ఉంటుంది. ప్రీమియం వేరియంట్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పెర్ఫార్మెన్స్ వేరియంట్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..

ఫీచర్స్ విషయానికి వస్తే.. బీవైడీ సీలియన్ ఈవీ 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది కారు గురించి చాలా సమాచారం అందిస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్లోటింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌షేడ్‌తో పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.

బీవైడీ సీలియన్ 7 ఈవీ 82.56 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ప్రీమియం వేరియంట్ ఒక సింగిల్ ఛార్జితో 482 కిమీ రేంజ్ అందిస్తే.. పెర్ఫార్మెన్స్ వేరియంట్ 456 కిమీ రేంజ్ అందిస్తుంది. మొత్తం మీద ఈ రెండు కార్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. ఈ కారు 'వోల్వో సీ40 రీఛార్జ్'కు ప్రత్యర్థిగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement