500 కిమీ/గం స్పీడ్.. బుగాటి సరికొత్త హైపర్ కారు | Bugatti Hybrid Hyper Car To Have 500 KMPH Top Speed | Sakshi
Sakshi News home page

500 కిమీ/గం స్పీడ్.. బుగాటి సరికొత్త హైపర్ కారు

Published Thu, Jun 20 2024 6:04 PM | Last Updated on Thu, Jun 20 2024 6:20 PM

Bugatti Hybrid Hyper Car To Have 500 KMPH Top Speed

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కారును అభివృద్ధి చేసిన సుమారు ఎనిమిది సంవత్సరాల తరువాత 'బుగాటి' (Bugatti) మరో సూపర్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీని వేగం 500 కిమీ/గం. ఈ కారుకు సంబంధించిన యాక్సలరేషన్ వీడియోను కంపెనీ ఇప్పటికే తన  ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

స్పీడోమీటర్‌కు ఎడమవైపున మూడు గేజ్‌లు సెట్ చేసి ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో రీడింగ్ గరిష్టంగా 350 కిమీ/గం మాత్రమే చూపిస్తుంది. అయితే వీడియోలో గేజ్‌లు ఈ వేగాన్ని అధిగమించడం చూడవచ్చు. బుగాటి రిమాక్ సీఈఓ మేట్ రిమాక్ కొత్త బుగాటి హైపర్‌కార్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉంటుందని ఇప్పటికే ధ్రువీకరించారు.

ఐకానిక్ క్వాడ్ టర్బో డబ్ల్యూ16 స్థానంలో.. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ16 ఇంజిన్ మాత్రమే కాకుండా మూడు ఎలక్ట్రిక్ మోటార్‌లను పొందనున్నట్లు సమాచారం. కారు ముందు భాగంలో రెండు మోటార్లు, వెనుక భాగంలో ఒక మోటార్ ఉంటుంది. ఇవన్నీ 25 కిలోవాట్ సామర్థ్యంతో ఉన్నట్లు సమాచారం.

బుగాటి కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న చిరోన్ కంటే కొంచెం బరువుగా ఉంటుంది. పవర్ అవుట్‌పుట్ కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువగానే ఉంటుంది. కంపెనీ సరికొత్త హైపర్ కారు గురించి మరిన్ని వివరాలను జూన్ 21న అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement