కోవిడ్‌ అనంతర ఆర్థిక స్థిరత్వమే బడ్జెట్‌ లక్ష్యం

Budget Will Bring Stability To Economy Says Nirmala Sitharaman - Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశం

చెన్నై: భారత్‌ ఆర్థిక వ్యవస్థలో కోవిడ్‌–19 అనంతర స్థిరత్వమే 2022–23 వార్షిక బడ్జెట్‌ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 2021–22 వార్షిక బడ్జెట్‌ను కూడా ఇదే విధమైన లక్ష్యంతో రూపొందించడం జరిగిందనీ, దానికి కొనసాగింపే 2022–23 వార్షిక బడ్జెట్‌ అని ఆమె తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో జరిగిన ఒక సమావేశంలో ఆర్థిక మంత్రి మంగళవారం ప్రసంగించారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే,   ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కొనసాగింపు. కోవిడ్‌–19 మహమ్మారి నుండి ఆర్థిక పునరుజ్జీవనం, స్థిరత్వం లక్ష్యంగా రూపొందిన బడ్జెట్‌ ఇది.

  ’ఇండియా (యట్‌) 100’ చొరవలో భాగంగా వ్యవసాయం వంటి వివిధ రంగాలకు సాంకేతికత సౌలభ్యత పెంచడం, వైద్యం, విద్య వంటి వాటిలో డిజిటల్‌ ప్రోగ్రామ్‌లను విస్తరించడం వంటి అంశాల ద్వారా బడ్జెట్‌ భవిష్యత్‌ చర్యలను చేపట్టింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తుంది. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ పురోగతిపై దృష్టి సారిస్తుంది. ఆర్థికశాఖ సీనియర్‌ అధికారులుసహా ఇండియా సిమెంట్స్‌  వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ శ్రీనివాసన్, జీఆర్‌టీ జ్యువెలరీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీఆర్‌ అనంత పద్మనాభన్, అపోలో హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతా రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top