
ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త, చౌకౌన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉంది. ఇటీవల అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఇతర ప్రయోజనాలతో రూ .199 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.
రూ .199 రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు
రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ (Recharge plan) లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అదనంగా టెలికాం ఆపరేటర్ రీఛార్జ్ పై 2% తగ్గింపును కూడా అందిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్, సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఇవి కాకుండా, బీఎస్‌ఎన్‌ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వినియోగదారుల కోసం కేవలం రూ .107 నుండి ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 35 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో 3 జీబీ హైస్పీడ్ డేటా, 200 ఫ్రీ వాయిస్ మినిట్స్ (లోకల్, ఎస్టీడీ, రోమింగ్) లభిస్తాయి. అదనంగా, రూ .141 ప్యాక్ కూడా ఉంది. ఇది 30 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 200 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది.
ఇదీ చదవండి: జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్