బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ అరుదైన ఘనత | Brooke Bond Taj Mahal Tea Creates Guinness Record With World's Largest Interactive Billboard In Vijayawada - Sakshi
Sakshi News home page

బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ.. ప్రపంచంలోనే అతిపెద్ద బిల్‌బోర్డ్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్

Published Wed, Oct 4 2023 6:55 PM

Brooke Bond Taj Mahal Tea Create Guinness Record With World Largest Billboard - Sakshi

బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ సృష్టించింది. విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్‌మెంటల్ ఇంటరాక్టివ్ బిల్‌బోర్డ్‌ను ఆవిష్కరించడంతో ఈ ఘనతను సాధించింది.  

'మేఘ్ సంతూర్' పేరుతో 2250 చదరపు అడుగుల బిల్‌బోర్డ్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో రూపొందించారు. 50 మంది నిపుణుల బృందంతో 6 నెలల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన ఈ బిల్‌ బోర్డ్‌ విజయవాడ నగర వాసుల్ని సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టేలా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 

దీంతో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ తాజ్ మహల్ టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అందించారు.

Advertisement
 
Advertisement