
తల్లిదండ్రులు ఎంత సంపాదించినా.. వారి ఆస్తి నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఎదిగేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. బిల్‌గేట్స్ కుమార్తె 'ఫోబ్ గేట్స్' (Phoebe Gates). ఈమె తండ్రిపై ఆధారపడకుండానే.. సొంతంగా స్టార్టప్ కోసం నిధులను సమకూర్చుకుంది. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని టెక్ బిలియనీర్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
తన కుమార్తె ఫోబ్ గేట్స్.. తన స్టార్టప్ కోసం నిధులను సేకరించే క్రమంలో, తన దగ్గరకు వస్తుందని నేను ఊహించాను. ఒకవేళ తను నన్ను సహాయం చేయమని అడిగి ఉంటే.. తప్పకుండా చేసేవాణ్ణి. అయితే కొన్ని షరతులు కూడా పెట్టేవాడినని బిల్‌గేట్స్ అన్నారు. అయితే నిధుల కోసం నన్ను సంప్రదించకుండా.. సొంతంగా సమకూర్చుకున్న కూతురిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
22 ఏళ్ల ఫోబ్ గేట్స్.. తన స్నేహితురాలు సోషియా కియానీతో కలిసి 'ఫియా' అనే స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక సిజిటల్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్. ఇందులో సుమారు 40,000 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న దుస్తుల ధరలను వెల్లడిస్తుంది. వినియోగదారులకు ఫ్యాషన్ ఉత్పత్తుల మీద బెస్ట్ డీల్స్ అందించడంతో పాటు.. ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం.
ఇదీ చదవండి: నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
2024లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన.. ఫోబ్ గేట్స్ తన స్టార్టప్ కోసం వెంచర్ క్యాపిటలిస్టులు & ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 500000 డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. సుమారు 102.2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తన తండ్రి బిల్‌గేట్స్ సహాయం పొందకుండా.. స్టార్టప్ ప్రారభించడం గొప్ప విషయం అని పలువు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో ముగ్గురు పిల్లలను కన్నారు. వారు జెన్నిఫర్ (28), రోరీ (25), ఫోబ్.