ఎయిర్‌టెల్ వింక్‌ మ్యూజిక్‌ షట్‌డౌన్‌: కారణం ఇదే.. | Bharti Airtel to Shut Down Wynk Music App | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ వింక్‌ మ్యూజిక్‌ షట్‌డౌన్‌: కారణం ఇదే..

Aug 27 2024 6:50 PM | Updated on Aug 27 2024 8:11 PM

Bharti Airtel to Shut Down Wynk Music App

భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ తన వింక్ మ్యూజిక్ యాప్‌ను త్వరలోనే నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇందులో పనిచేసే ఉద్యోగులను బయటకు పంపించేది లేదని, వారందరినీ కంపెనీలోని సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్‌టెల్ కంపెనీ యాపిల్‌తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వింక్ మ్యూజిక్ నిలిపివేసిన తరువాత ఎయిర్‌టెల్ యూజర్లు యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినొచ్చని కంపెనీ వెల్లడించింది. అయితే వింక్ ప్రీమియం  సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి కంపెనీ ఓ స్పెషల్ ఆఫర్ అందించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement