
ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా టీకా ధరలను ఈ వ్యాధి ప్రబలంగా ఉండే కొన్ని దేశాల్లో సగానికి తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్, జీఎస్‌కేలు ప్రకటించాయి. ఆయా దేశాల్లో 2028 నుంచి మలేరియా నివారణ టీకాలు ఐదు డాలర్ల కంటే తక్కువ ధరకు లభిస్తాయని ఇరు సంస్థలు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు వ్యాక్సీన్లను పంపిణీ చేసేందుకు ఏర్పాటైన ‘ద వ్యాక్సీన్ అలయన్స్’కు 2026- 2030 మధ్య సరఫరా చేసే టీకాలపై ఒక ఒప్పందం కుదిరిన సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి. జీఎస్‌కే, పాథ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మలేరియా టీకా ఆర్‌టీఎస్.ఎస్‌ను మలేరియా నివారణకు ఉపయోగించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021లోనే అనుమతులిచ్చింది. అయితే ఉత్పత్తి మార్గాల్లో మెరుగుదల, సామర్థ్యం పెంపు, లాభాన్ని కనీస స్థాయిలో ఉంచడం వంటి కారణాల వల్ల టీకా ధర సగానికి తగ్గించడం వీలైందని భారత్ బయోటెక్, జీఎస్‌కేలు వివరించాయి.
‘‘వ్యాక్సీన్ అలయెన్స్‌కు టీకాల సరఫరా చేస్తామన్న ఒప్పందం కుదరడం వల్ల లక్షల మంది పిల్లలు, కుటుంబాలపై మలేరియా సమస్య తగ్గిపోతుంది. ఈ చర్య మాకు కేవలం వ్యాక్సీన్ అలయన్స్‌కు సహకరించడం మాత్రమే కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం’’ అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. జీఎస్‌కే సహకారంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా బాధిత బాలలు, వారికి అందుబాటులో ఉన్న టీకాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్నాం అని చెప్పారు. న్, పాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారం కూడా ఉంది.’’ అని అన్నారు.
కాగా, ఘన, కీన్యా, మలవాయి వంటి దేశాల్లో ఇటీవలే సుమారు ఇరవై లక్షల మంది పిల్లలకు మలేరియా టీకా ఇవ్వడం వల్ల ఈ వ్యాది కారణంగా మరణించే వారి సంఖ్య 13 శాతం వరకూ పడిపోయిందని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 22 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. మలేరియా సమస్య ఎక్కువగా ఉన్న చోట్ల ఈ టీకాతోపాటు మలేరియా సీజన్‌లో తగిన మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని గణనీయంగా నివారించడం సాధ్యమైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
(చదవండి: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్ పిచాయ్‌కి కలిగిన సందేహం)