Better.com Announces Fresh Round Of Layoffs, Shut Down Real Estate Unit - Sakshi
Sakshi News home page

బెటర్‌ డాట్‌ కామ్‌ రియ‌ల్ ఎస్టేట్ యూనిట్‌ షట్‌డౌన్‌.. వేల మంది ఉద్యోగుల తొలగింపు

Jun 12 2023 9:29 PM | Updated on Jun 13 2023 11:40 AM

Better.com Announces Fresh Round Of Layoffs, Shut Down Real Estate Unit - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆర్ధిక మంద‌గ‌మ‌నం వెంటాడుతుండ‌టంతో మార్ట్‌గేజ్ సంబంధిత సేవ‌ల‌ను అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం బెట‌ర్‌.కాం (Better.com) సంచలన నిర్ణయం తీసుకుంది. త‌న రియ‌ల్ ఎస్టేట్ విభాగాన్ని మూసివేసింది. మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొల‌గించిన‌ట్టు బెట‌ర్‌.కాం వ్య‌వ‌స్ధాప‌క సీఈవో విశాల్ గార్గ్ వెల్ల‌డించారు.

మార్ట్‌గేజ్ మార్కెట్‌లో నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అయితే, మార్ట్‌గేజ్ వ‌డ్డీ రేట్ల పెరుగుద‌ల‌తో ఈ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకునేందుకు కంపెనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేప‌ధ్యంలో 4,000 మంది ఉద్యోగుల తొలగింపు ముందే ఊహించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

మ‌రోవైపు సోష‌ల్ మీడియా సంస్థ రెడిట్ 90 మంది ఉద్యోగుల‌ను విధుల నుంచి తొలగించింది. వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌లు, ఆర్ధిక అనిశ్చితి కార‌ణ‌గా గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జాల‌తో పాటు భార‌తీయ స్టార్ట‌ప్‌లు కూడా గ‌త ఏడాదిగా ఏకంగా 27,000 మందికిపైగా విధుల నుంచి తొల‌గించినట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement