ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ! | Bengaluru woman claimed cleared 14 rounds of interviews to developer job | Sakshi
Sakshi News home page

ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!

Jun 14 2025 1:16 PM | Updated on Jun 14 2025 1:42 PM

Bengaluru woman claimed cleared 14 rounds of interviews to developer job

బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో డెవలపర్‌ ఉద్యోగం కోసం 14 రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్‌ చేశానని ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. విప్రో క్యాంపస్‌లో ఉన్న ఫొటోలతో పాటు కంపెనీ లోగోను చూపిస్తూ అంతరా మండల్ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌ థ్రెడ్‌లో వివరాలు షేర్ చేశారు.

ధ్రువీకరణ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ఆఫీస్ ఐడీ కార్డు కూడా పోస్ట్ చేశారు. ఉద్యోగం కోసం ఏకంగా 14 రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేసి కొలువు దక్కించుకున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి చివరకు విప్రోలో డెవలపర్ పొజిషన్‌కు ఎంపికయ్యాను. మీ నిద్రలో వచ్చేవి కలలు కావు.. మిమ్మల్ని నిద్రపోనివ్వనివే అసలైన కలలు’ అని ఆమె రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ‘స్మార్ట్‌’ సూచన

అయితే సామాజిక మాధ్యామాల్లో ఈ పోస్ట్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఉద్యోగం కోసం ఇన్ని రౌండ్లు ఇంటర్వ్యూ చేయడంపై చాలా మంది వినియోగదారులు విమర్శించారు. కొందరు ఇందుకు భిన్నంగా రిప్లై ఇచ్చారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూ? అది కూడా డెవలపర్ రోల్ కోసమే.. చాలా ఫన్నీ యార్’ అని ఒక యూజర్ స్పందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement