జూన్‌లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే.. | Bank Holidays in India 2025 June | Sakshi
Sakshi News home page

జూన్‌లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..

May 28 2025 12:20 PM | Updated on May 28 2025 12:38 PM

Bank Holidays in India 2025 June

Bank Holidays in June 2025: మే నెల ముగుస్తోంది. జూన్ నెల వచ్చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే నెల సెలవుల జాబితాను విడుదల చేసింది. జూన్ నెలలో శని, ఆదివారాలతో కలిపి మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉంటాయి.

జూన్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా
▸జూన్ 1 ( ఆదివారం ): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
▸జూన్ 6 (శుక్రవారం) ఈద్-ఉల్-అద్హా (బక్రీద్): కేరళ బ్యాంకులకు సెలవు
▸జూన్ 7 (శనివారం) బక్రీద్: భారతదేశంలో అన్ని బ్యాంకులకు సెలవు
▸జూన్ 8 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
▸జూన్ 11 (బుధవారం) సంత్ గురు కబీర్ జయంతి / సాగా దావా: సిక్కిం & హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు.
▸జూన్ 14 (శనివారం) రెండవ శనివారం: దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
▸జూన్ 15 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
▸జూన్ 22 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
▸జూన్ 27 (శుక్రవారం) రథ యాత్ర / కాంగ్ (రథజాత్ర): ఒడిషా & మణిపూర్‌లలో బ్యాంకులకు సెలవు
▸జూన్ 28 (శనివారం) నాల్గవ శనివారం: దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
▸జూన్ 29 (ఆదివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
▸జూన్ 30 (సోమవారం) రెమ్నా ని: మిజోరంలో బ్యాంకులకు సెలవు

బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.

(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్‌ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement