వచ్చేవారం.. బ్యాంక్ హాలిడేస్ ఇవే! | Bank Holiday Next Week When are SBI HDFC ICICI and Other Bank Branches Closed | Sakshi
Sakshi News home page

వచ్చేవారం.. బ్యాంక్ హాలిడేస్ ఇవే!

Sep 19 2026 7:49 PM | Updated on Sep 19 2026 7:56 PM

Bank Holiday Next Week When are SBI HDFC ICICI and Other Bank Branches Closed

బ్యాంకులకు సెలవులు ఎప్పటికప్పుడు.. రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో పాటు జాతీయ, రాష్ట్ర పండుగలు, ఇతర ప్రాంతీయ పండుగల రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అందుకే బ్యాంకు బ్రాంచ్‌లో ఏదైనా పని ఉంటే.. సెలవుల జాబితాను ముందుగానే తెలుసుకోవడం మంచిది.

  • సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు వచ్చే వారం కూడా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏ రోజుల్లో, ఏయే ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయో చూద్దాం.

  • సెప్టెంబర్ 21 - సోమవారం: శ్రీమంత శంకరదేవ, శ్రీ నారాయణ గురు సమాధి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 21న గౌహతి, కొచ్చి, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.

  • సెప్టెంబర్ 22 - మంగళవారం: కర్మ పూజ సందర్భంగా సెప్టెంబర్ 22న రాంచీలోని బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.

  • సెప్టెంబర్ 23 - బుధవారం: మహారాజా హరి సింగ్ జీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 23న జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

  • సెప్టెంబర్ 25 - శుక్రవారం: ఇంద్రజాతర సందర్భంగా సెప్టెంబర్ 25న గాంగ్‌టక్‌లోని బ్యాంకు శాఖలు పనిచేయవు.

  • సెప్టెంబర్ 26 - శనివారం: సెప్టెంబర్ 26 నాలుగో శనివారం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.

  • సెప్టెంబర్ 27 - ఆదివారం: సెప్టెంబర్ 27 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

అందుబాటులో బ్యాంకింగ్ సేవలు
బ్యాంకు సెలవు ఉన్నప్పటికీ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చాలా లావాదేవీలు చేసుకోవచ్చు. యూపీఐ చెల్లింపులు కూడా కొనసాగుతాయి. అవసరమైతే ఏటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చు. అయితే.. బ్యాంకు బ్రాంచ్‌కు నేరుగా వెళ్లి చేయాల్సిన పనులు మాత్రం సెలవు రోజుల్లో జరగవు. చెక్కుల క్లియరెన్స్, బ్రాంచ్‌లో చేయాల్సిన కొన్ని లావాదేవీలు వాయిదా పడవచ్చు.

కాబట్టి బ్యాంకు బ్రాంచ్‌లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే.. సెలవు రోజులను ముందుగానే చూసుకుని మీ పనిని ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే మీ ప్రాంతంలోని బ్రాంచ్‌కు సెలవు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని బ్యాంకు అధికారిక మార్గాల ద్వారా ఒకసారి నిర్ధారించుకోవచ్చు.

ఇదీ చదవండి: డబ్బు సమస్యలు తగ్గాలంటే?: కియోసాకి చెప్పిన సీక్రెట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement