మీ పన్ను భారం.. మీరే ప్లాన్‌ చేసుకోండి.. | An Attempt To Plan For Reducing The Tax Burden | Sakshi
Sakshi News home page

మీ పన్ను భారం.. మీరే ప్లాన్‌ చేసుకోండి..

Jun 8 2026 8:33 AM | Updated on Jun 8 2026 8:33 AM

An Attempt To Plan For Reducing The Tax Burden

మీరు కొత్త పద్ధతిని ఎంచుకుంటున్నారా లేక పాత పద్ధతా?

ఆ ఇంట్లో ఏప్రిల్‌ మొదటి వారంలో పండుగ వాతావరణం నెలకొంది. కోలాహలం. హడావుడి. కారణం ఏమిటంటే, ఆ ఇంటాయన కొడుకు చైతన్య, కోడలు, పిల్లలు అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అమెరికాలో చైతన్య యజమాని తెలుగు వ్యక్తి. మాటల్లో హైదరాబాద్‌లో ఒక ఆఫీస్‌ పెట్టడం, ఆ ఆఫీస్‌కి ఇన్‌చార్జి బాధ్యతలను పూర్తిగా చైతన్యకి అప్పగించడం చకచకా జరిగింది. నెలకు రూ. 5,00,000 జీతం. ఆఫీసులో జాయిన్‌ కాగానే, ఉత్సాహం, ఆనందం వగైరాల తర్వాత ఇన్‌కం ట్యాక్స్‌ లెక్కల ప్రస్తావన వచి్చంది. ‘‘మీరు కొత్త పద్ధతిని ఎంచుకుంటున్నారా లేక పాత పద్ధతా’’ అని అడిగారు హెచ్‌ఆర్‌ వాళ్లు. వివరాల్లోకి వెళ్తే, నెలవారీ జీతం అన్నీ కలిపి రూ. 5,00,000. మిడిమిడి జ్ఞానంతో మెటా ద్వారా తన ఆదాయపు పన్ను భారమెంతో తెలుసుకున్నాడు.

అంటే నెలకు రూ.1,29,415 రికవరీ చేయాలి..
ఈ లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాడు చైతన్య. అయితే, చైతన్య తండ్రి ‘ఇది సరే గానీ.. ఒకసారి పాత పద్ధతి ప్రకారం లెక్క కట్టు.. నాకు ఎలాగూ రూ.6,00,000 దాటి ఆదాయం లే దు. మరో రూ.6,00,000 నా పేరు మీద అద్దె అన్నట్లుగా లెక్క వేయి‘ అన్నారు. చిన్నప్పటి ఫ్రెండ్‌కి ఫో న్‌ చేస్తే పాత పద్ధతిలో ఈ విధంగా లెక్క కట్టాడు. బేసిక్‌ రూ. 48,00,000, ఇంటద్దె రూ. 12,00,000.


చైతన్య ఈ రెండు స్టేట్‌మెంట్లు ఎదురుగా పెట్టుకుని కంపేర్‌ చేయడం మొదలుపెట్టాడు. కొత్త పద్ధతిలో చేతికొచ్చేది రూ. 60,00,000, పన్నుగా చెల్లించాల్సినది రూ. 15,52,980 లేదా రూ. 15,53,000 అనుకోండి. మిగిలేది రూ. 44,47,000. నెలకు రూ. 3,70,580 అవుతుంది. సొంత ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండటం, పిల్లల విషయంలో తాత, బామ్మల పర్యవేక్షణ, ఆలనా పాలనా దన్ను ఉంటాయి.

రెండో పద్ధతిలో రూ. 60,00,000లో నుంచి తండ్రికి రూ. 6,00,000 ఇవ్వాలి. ఇచ్చి మళ్లీ వెనక్కి పుచ్చుకోవచ్చేమో.. అలా ఆలోచించకండి. మిగిలింది రూ. 54,00,000. ఇందులో నుంచి 80సి కింద కమిట్‌మెంట్‌ రూ. 1,50,000, పన్ను రూ. 17,34,876 (రౌండ్‌ ఫిగరు రూ. 17,35,000) తీసివేస్తే చేతిలో ఆడేది రూ. 35,15,000.

చేతిలో మిగిలిన మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ రెండింటిలో తేడా రూ. 44,47,000 – రూ. 35,15,000 = రూ. 9,32,000. అంటే నెలకు రూ. 77,666 (రౌండ్‌ ఫిగరు రూ. 77,000) అదనంగా మిగులుతుంది.

ఆఫీసుకు వెళ్లి రావడానికి ఖర్చుల్లో ఏమీ మార్పు ఉండదు. పిల్లల చదువులకోసం చెల్లించాల్సిన ఖర్చులకు పూర్తిగా తగ్గింపు ఉండదు. మన ఇష్టం మీద చదివించే చదువులనేవి తల్లిదండ్రులుగా మన బాధ్యత. బరువు కాదు. మన స్టైల్‌ ఆఫ్‌ లివింగ్‌.. మన ఇష్టం. ఆడంబరాలకు పోవద్దు. అప్పుల పాలు కావొద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement