11 ఏళ్లకే 25 కోట్ల స్టార్టప్‌.. టెక్‌ ప్రపంచానికి చాలెంజ్‌! | Schoolboy Entrepreneur, 11 Year Old Develops Digital Business Card Startup Valued At ₹25 Crore, Check More Details | Sakshi
Sakshi News home page

11 ఏళ్లకే 25 కోట్ల స్టార్టప్‌.. టెక్‌ ప్రపంచానికి చాలెంజ్‌!

Jul 7 2026 8:06 AM | Updated on Jul 7 2026 9:59 AM

Athvik Amit Kumar's Builds NFC Business Card Startup

యాప్‌ రే!

గొప్పగొప్ప ఆవిష్కరణలు సైన్స్‌ల్యాబ్‌లోనే పుట్టాల్సిన పని లేదు స్కూలు బ్యాగు మోసే కుర్రవాడి బుర్రలో కూడా పుట్టొచ్చు. ఇందుకు నిదర్శనమే అత్విక్‌ అమిత్‌ కుమార్‌. తమిళనాడుకి చెందిన ఈ కుర్రవాడి వయసేమో 11 ఏళ్లు. ఇంకా స్కూలు చదువులు కూడా పూర్తి కాకుండానే ఓ స్టార్టప్‌ పెట్టి టెక్‌ ప్రపంచానికి చాలెంజ్‌ విసిరాడు.

బిజినెస్‌ కార్డులు వ్యాపారంలో విరివిగా వాడుతుంటారు. ఓ వ్యక్తి అడ్రస్‌ మారినా, లేదా పని చేస్తున్న కంపెనీ మారినా తన బిజినెస్‌ కార్డుని మళ్లీ కొత్తగా తయారు చేయించాలి. ఇది ఎక్కడైనా మామూలుగా జరిగేదే.. కాని ఇదే అత్విక్‌ని ఆలోచింపజేసింది. అప్పుడు పుట్టిన ఆలోచనే డిజిటల్‌ బిజినెస్‌ కార్డ్‌. ఈ కార్డ్‌ మీద ఎన్‌ఎఫ్‌సీ, క్యుఆర్‌ కోడ్‌ ఆధారిత చిప్‌ ఉంటుంది. ఆ చిప్‌ను స్కాన్‌ చేస్తే వ్యక్తి తాలూకు మొబైల్‌ నంబర్, ఈ మెయిల్, అడ్రస్, సోషల్‌ మీడియా ప్రొఫైల్స్, జాబ్‌ పోర్టల్స్, కంపెనీ పేరు, లొకేషన్‌ సహా పూర్తి సమాచారం మన మొబైల్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది.

కార్డ్‌ వినియోగించే వ్యక్తి ఓ ప్రత్యేకమైన యాప్‌తో లింక్‌ చేసి ఎప్పటికప్పుడు తన డీటెయిల్స్‌ను అప్‌డేట్‌ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక డిజిటల్‌ కార్డ్‌ జీవితాంతం వినియోగించేందుకు సరిపోతుంది. దీనికోసం మళ్లీ పేపర్‌ వర్క్స్, కార్డ్‌ ప్రింటింగ్‌ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ వినూత్న ఆలోచనలో ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో సంచలనం సృష్టించింది. పెట్టుబడిదారులు ఈ ఆవిష్కరణ విలువ 25 కోట్లుగా నిర్ధారించారు. స్కూలు బ్యాగు మోసే వయసులో స్టార్టప్‌ పెట్టి ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని షేక్‌ చేసిన అత్విక్‌ను సోషల్‌ మీడియా వేదికగా నెటిజెన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement