breaking news
online card transactions
-
11 ఏళ్లకే 25 కోట్ల స్టార్టప్.. టెక్ ప్రపంచానికి చాలెంజ్!
గొప్పగొప్ప ఆవిష్కరణలు సైన్స్‌ల్యాబ్‌లోనే పుట్టాల్సిన పని లేదు స్కూలు బ్యాగు మోసే కుర్రవాడి బుర్రలో కూడా పుట్టొచ్చు. ఇందుకు నిదర్శనమే అత్విక్ అమిత్ కుమార్. తమిళనాడుకి చెందిన ఈ కుర్రవాడి వయసేమో 11 ఏళ్లు. ఇంకా స్కూలు చదువులు కూడా పూర్తి కాకుండానే ఓ స్టార్టప్ పెట్టి టెక్ ప్రపంచానికి చాలెంజ్ విసిరాడు.బిజినెస్ కార్డులు వ్యాపారంలో విరివిగా వాడుతుంటారు. ఓ వ్యక్తి అడ్రస్ మారినా, లేదా పని చేస్తున్న కంపెనీ మారినా తన బిజినెస్ కార్డుని మళ్లీ కొత్తగా తయారు చేయించాలి. ఇది ఎక్కడైనా మామూలుగా జరిగేదే.. కాని ఇదే అత్విక్ని ఆలోచింపజేసింది. అప్పుడు పుట్టిన ఆలోచనే డిజిటల్ బిజినెస్ కార్డ్. ఈ కార్డ్ మీద ఎన్ఎఫ్సీ, క్యుఆర్ కోడ్ ఆధారిత చిప్ ఉంటుంది. ఆ చిప్‌ను స్కాన్ చేస్తే వ్యక్తి తాలూకు మొబైల్ నంబర్, ఈ మెయిల్, అడ్రస్, సోషల్ మీడియా ప్రొఫైల్స్, జాబ్ పోర్టల్స్, కంపెనీ పేరు, లొకేషన్ సహా పూర్తి సమాచారం మన మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.కార్డ్ వినియోగించే వ్యక్తి ఓ ప్రత్యేకమైన యాప్‌తో లింక్ చేసి ఎప్పటికప్పుడు తన డీటెయిల్స్‌ను అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక డిజిటల్ కార్డ్ జీవితాంతం వినియోగించేందుకు సరిపోతుంది. దీనికోసం మళ్లీ పేపర్ వర్క్స్, కార్డ్ ప్రింటింగ్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ వినూత్న ఆలోచనలో ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో సంచలనం సృష్టించింది. పెట్టుబడిదారులు ఈ ఆవిష్కరణ విలువ 25 కోట్లుగా నిర్ధారించారు. స్కూలు బ్యాగు మోసే వయసులో స్టార్టప్ పెట్టి ఇంటర్నేషనల్ మార్కెట్‌ని షేక్ చేసిన అత్విక్ను సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ప్లాస్టిక్ మనీ జోరు..!
ముంబై: దేశంలో ప్లాస్టిక్ మనీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వినియోగం భారీగా పెరుగుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లో ఇప్పటికే దాదాపు 36.9 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు సర్క్యులేషన్లో ఉన్నాయి. వీటిలో 35 కోట్ల కార్డులు డెబిట్ కార్డులు. 1.9 కోట్ల కార్డులు క్రెడిట్ కార్డులు. 10-15 శాతం కార్డులు కేవలం ఆన్లైన్ లావాదేవీల కోసమే వినియోగిస్తున్నారు. చిన్న పట్టణాల్లో సైతం ఈ తరహా లావాదేవీలు పెరుగుతున్నాయి. ఆర్బీఐ ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. ‘పేమెంట్ సిస్టమ్ అప్లికేషన్స్-ఎనేబిలింగ్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ)’ పేరుతో ఈ నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ నివేదికలో రెండు ప్రధాన పేమెంట్ నెట్‌వర్క్‌లు- మాస్టర్ కార్డ్, వీసాలను ఉటంకించింది. నివేదికలో ముఖ్యాంశాలు... భారత్ ఈ-పేమెంట్స్ విధానంలో ‘కార్డ్ పేమెంట్లు’ అంతర్గత భాగంగా మారాయి. డబ్బు బదలాయింపు, షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి పలు అవసరాలకు కస్టమర్ల ‘కార్డ్’ల వినియోగం పెరుగుతోంది. క్రెడిట్ కార్డును ఆచితూచి చేసే ఖర్చులకు వినియోగిస్తున్నారు. 1998లో దేశంలోకి ప్రవేశిం చిన డెబిట్ కార్డులను రోజూవారీ మామూలు ఖర్చులకు వాడుతున్నారు. క్రెడిట్ కార్డుల్లో దాదాపు 30 శాతం ఆన్లైన్ వినియోగంలో ఉన్నాయి. మాస్టర్ కార్డ్ నెట్వర్క్ ద్వారా లభ్యమవుతున్న సమాచారం ప్రకారం కార్డ్ పేమెంట్లలో 75 శాతం కేవలం 20 పట్టణాల్లో కేంద్రీకృతమయ్యాయి. వీటిలో 43 శాతం వాటా ఢిల్లీ, ముంబై, వాటి సబర్బన్ ప్రాంతాలదే. వీసా అధ్యయనం ప్రకారం- రూ.75,000 నుంచి రూ.1,00,000 శ్రేణిలో నెలవారీ ఆదాయం ఉన్న వారు ఎక్కువమంది ఎలక్ట్రానిక్ కార్డును వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్లు ఎక్కువగా జరుగుతున్న వ్యయ విభాగాల్లో రైల్-ఎయిర్‌ఫేర్ (71 శాతం), మన్నికైన వస్తువులు (61 శాతం), అద్దెలు (49 శాతం), టెలిఫోన్-మొబైల్ (47 శాతం), మెడికల్ ఇన్స్టిట్యూట్ (46 శాతం), దుస్తులు-పాదరక్షలు (44 శాతం), శీతల పానియాలు-రిఫ్రష్మెంట్స్ (35 శాతం) ఉన్నాయి. డెబిట్ కార్డులకన్నా దశాబ్దం ముందు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, వాటితో పోల్చితే క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధిరేటు నెమ్మదిగా ఉంది. ఆభరణాలు, విందు, షాపింగ్ వంటి వ్యయాలకు క్రెడిట్ కార్డులను అధికంగా వినియోగిస్తున్నారు.


