ప్రియుడి బర్త్‌డే బాష్‌: మలైకా డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా

Arjun Kapoor birthday bash Do you  know Malaika Arora dress cost - Sakshi

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్  ఇటీవల (జూన్‌ 26) పుట్టినరోజు వేడుకును చాలా గ్రాండ్‌గా  సెలబ్రేట్‌ చేసుకున్నాడు.అతని ప్రేయసి మలైకా అరోరా  స్టార్ ప్రింటెడ్ బాడీకాన్ డ్రెస్‌లో  దిల్ సే చిత్రంలోని సూపర్‌హిట్‌ సాంగ్‌ ఛైయ్యా ఛైయ్యాకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది. సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ బర్త్ డే బాష్ వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్న మలైకా అరోరా బాడీకాన్ డ్రస్ ఎంత అనే చర్చ జోరందుకుంది.  దీని ధర అక్షరాల 99వేల రూపాయలట. మలైకా అరోరా రిబ్బడ్ బాడీకాన్ డ్రెస్ స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవేకి చెందిన రిబ్బెడ్ కాటన్ జెర్సీలో ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అంటారు. స్లీవ్‌లెస్ వైట్‌ గౌన్‌పై ఎరుపు రంగు ఆంథూరియం పువ్వులను అందంగా డిజైన్‌ చేశారు. మలైకా వైట్‌ అండ్‌ రెడ్‌  గౌనులో మెరిసిపోవడమేకాదు, కిల్లింగ్‌ స్టెప్స్‌తో  ఇరగదీసింది.

ఈ వేడుకలో అతని సోదరి ఖుషీ కపూర్,  అన్షులా కపూర్‌తో పాటు ఆమె ప్రియుడు రోహన్ థక్కర్,   కునాల్ రావల్, అర్పితా మెహతా తదితరులు సందడి చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top