యాపిల్‌ సంచలన నిర్ణయం: యూజర్లకు షాక్‌?

Apple may stop offering customer support on X and YouTube - Sakshi

ట్విటర్‌, యూట్యూబ్‌లో  కస్టమర్‌ సపోర్ట్‌ నిలిపివేత

అక్టోబర్‌ 1 నుంచి యూజర్లకు   సోషల్‌ మీడియా ద్వారా సమాధానాలివ్వదు

సపోర్ట్‌ ఎడ్వైజర్లకు  తొలగించే ప్లాన్స్‌

టెక్‌ దిగ్గజం యాపిల్‌  సరికొత్త నిర్ణయంతో తన యూజర్లకు షాక్‌ ఇవ్వనుంది. సోషల్‌ మీడియాలో కస్టమర్‌ సహాయాన్ని నిలిపివేయనుంది. ఎక్స్‌ (ట్విటర్‌), యూట్యూబ్‌, సపోర్ట్‌ కమ్యూనిటీ ఆన్‌లైన్‌ ఫోరమ్‌లకు చెక్‌ పెట్టనుంది. అంతేకాదు సోషల్ మీడియా సపోర్ట్ అడ్వైజర్‌లను తొలగించాలని యోచిస్తోంది, అంటే కస్టమర్‌లు ఇకపై ట్విట్టర్, యూట్యూబ్‌లో ప్రత్యక్ష మద్దతు పొందలేరు. అక్టోబర్ నుండి  కస్టమర్ల డైరెక్ట్ మెసేజ్‌లకు వ్యక్తిగతంగా  సమాధానాలివ్వడం ఆపివేస్తుంది.

మ్యాక్‌ రూమర్స్‌ అందించిన సమాచారం ప్రకారం  సోషల్‌ మీడియా సపోర్ట్స్‌ అడ్వైజర్‌ ఉద్యోగుల్ని కూడా తొలగించనుంది. వచ్చే ఏడాది ఆరంభంనుంచి  ఈ చర్యకు దిగనుంది. అంటే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే  కస్టమర్‌లు ఇకపై ఈ ప్లాట్‌ఫారమ్‌లలో  యాపిల్‌ ఉద్యోగి సపోర్ట్‌ను  పొందలేరు.

అలాగే అక్టోబర్ నుండి, ట్విటర్‌లోని యాపిల్‌ సపోర్ట్‌ అనే అకౌంట్‌ ఇక పని చేయదు. యూజర్ల మెసేజ్‌లకు స్పందించదు. దీనికి బదులుగా  కస్టమర్‌లు సహాయం కోసం ఆటోమేటెడ్ సమాధానాలపై దృష్టి పెడుతోందని ఈ నివేదిక తెలిపింది. దీనికి ఫోన్ సపోర్ట్ అందించడానికి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వ నుందని, నవంబర్ నాటికి పరివర్తన పూర్తవుతుందని నివేదిక పేర్కొంది. దీనిపై పని చేయ కూడదనుకునే వారు యాపిల్ వెలుపల ఉద్యోగం చూసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది.

మరోవైపు సెప్టెబంరు 12న ఈ ఏడాది మెగా ఈవెంట్‌ను నిర్వహించనుంది యాపిల్‌.ఇందులో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్‌ చేయనుంది. ఇదే  ఈవెంట్‌లో కొత్త యాపిల్ వాచ్‌లను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

కాగా 2016నుంచి ట్విటర్‌ ద్వారా కస్టమర్ మద్దతును అందిస్తోంది. కానీ గత ఏడాది ట్విటర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతిలోకి వెళ్లిన తరువాత ఉద్యోగులతో ఇటీవల జరిగిన సమావేశంలో, ఫోన్ బేస్‌డ్‌ సపోర్ట్‌ నిర్ణయాన్ని సమర్ధించుకున్నట్టుతెలుస్తోంది. అయితే ఈ మార్పులపై యాపిల్‌ అధికారిక  ప్రకటన ఏదీ ఇంత వరకు విడుదల  చేయలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top