బంపర్ ఆఫర్.. రూ. 24900 ఎయిర్​పాడ్స్ కేవలం రూ. 16749కే.. | Sakshi
Sakshi News home page

బంపర్ ఆఫర్.. రూ. 24900 ఎయిర్​పాడ్స్ కేవలం రూ. 16749కే..

Published Sun, Oct 8 2023 9:09 PM

Apple Airpods pro 2 Available At Rs 16749 in E Commerce Sites in Festive Season - Sakshi

భారత్‌లో ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ వంటివి ప్రొడక్స్ మీద కనీవినీ ఎరుగని విధంగా డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే యాపిల్ ఎయిర్​పాడ్స్​ ప్రో సెకెండ్​ జెన్​పై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి.

యాపిల్ అధికారిక వెబ్​సైట్​లో ఎయిర్​పాడ్స్​ ప్రో 2 ధర రూ. 24,900 వరకు ఉంది. అయితే ఇది అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లలో మాత్రం రూ. 18,499కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డుల మీద కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఫలితంగా ఫ్లిప్​కార్ట్​లో రూ. 16,999 & అమెజాన్​లో రూ. 16,749కి కొనుగోలు చేయవచ్చు.

ఇదీ చదవండి: రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!!

2022లో విడుదలైన యాపిల్​ ఎయిర్​పాడ్స్​ ప్రో ఈ ఏడాది సెప్టెంబర్​లో వండర్​లస్ట్​ ఈవెంట్​లో ప్రో 2 గా విడుదలైంది. ఇది లాస్​లెస్​ ఆడియో విత్​ అల్ట్రా-లో లేటేన్సీ పొందుతుంది. ఇందులో హెచ్2 చిప్​సెట్ ఉంటుంది. యాపిల్​ విజన్​ ప్రోలో కూడా ఇదే చిప్​సెట్ ఉంటుంది. మొత్తం మీద ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement