
అపోలో హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ అనుపమ్ వెల్లడి
హెల్త్‌కేర్ రంగ హైదరాబాద్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరో 5 జినోమిక్స్ ఇన్‌స్టిట్యూట్స్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా తూర్పు, ఉత్తర, మధ్య భారతంలోని టైర్–2, 3 పట్టణాలలో వీటికి తెరతీయనున్నట్లు వెల్లడించింది. తద్వారా జినోమిక్స్‌ను ప్రధాన క్లినికల్ కేర్‌తో సమ్మిళితం చేయనున్నట్లు తెలియజేసింది. రానున్న మార్చి31లోగా ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, ఒడిషాలోని భువనేశ్వర్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోతోపాటు అస్సామ్‌లోని గౌహతిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ పిడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనుపమ్ సిబాల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశీయంగా 12 అపోలో జినోమిక్స్ ఇన్‌స్టిట్యూట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో హైదరాబాద్‌సహా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ ఉన్నట్లు వెల్లడించారు. వివిధ వ్యాధులు, వీటి పరిస్థితులను అర్థం చేసుకోవడంలో జినోమిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సమీకృత జినోమిక్ సర్వీసులను సమకూర్చుతున్నట్లు తెలియజేశారు. తద్వారా వ్యాధుల నిర్ధారణలో కచ్చితత్వం, రోగుల వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలో భద్రత, మార్గదర్శకత్వం తదితరాలను అందిస్తున్నట్లు వివరించారు.
పునరుత్పత్తి సంబంధిత జినోమిక్స్, అంకాలజీ, అరుదైన జెనెటిక్ వ్యాధులలో జినోమిక్స్ ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నట్లు అనుపమ్ పేర్కొన్నారు. రోగులకు జెనెటిక్ టెస్టింగ్, కౌన్సిలింగ్, వ్యక్తిగత చికిత్స తదితరాలలో సమీకృత సేవలు సమకూర్చుతున్నట్లు తెలియజేశారు. అపోలో జినోమిక్స్ ఇన్‌స్టిట్యూట్స్ 11,000 జినోమిక్ కన్సల్టేషన్స్ మైలురాయిని చేరినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఎస్‌బీఐ అంచనా