దేశీ విస్తరణపై అమెజాన్‌ దృష్టి | Amazon India to invest 233Million dollers to expand its operations infrastructure | Sakshi
Sakshi News home page

దేశీ విస్తరణపై అమెజాన్‌ దృష్టి

Jun 20 2025 3:35 AM | Updated on Jun 20 2025 9:32 AM

Amazon India to invest 233Million dollers to expand its operations infrastructure

రూ. 2,000 కోట్ల పెట్టుబడులకు రెడీ 

నెట్‌వర్క్‌ విస్తరణ, అప్‌గ్రేడ్‌ ప్రణాళికలు 

న్యూఢిల్లీ: ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ దేశీ కార్యకలాపాలను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు ఈ కేలండర్‌ ఏడాది(2025)లో రూ. 2,000 కోట్లు కేటాయించనుంది. ప్రధానంగా నెట్‌వర్క్‌ విస్తరణ, అప్‌గ్రేడ్‌పై పెట్టుబడులు వెచి్చంచనుంది. తద్వారా ఆధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలు, ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో అమెజాన్‌ పేర్కొంది. 

అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్లు, బ్రాడ్‌బ్యాండ్‌ విస్తరణ, డిజిటల్‌ చెల్లింపులకుతోడు, వినియోగ వ్యయాలు పెరుగుతుండటం వంటి సానుకూలతల నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలను మరింత అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఇటీవల కొన్నేళ్లుగా అమెజాన్‌సహా, రిటైల్‌ రంగ దిగ్గజం వాల్‌మార్ట్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తదితర ఆన్‌లైన్‌ సంస్థలు దేశీయంగా ఈబిజినెస్‌ను పరుగుపెట్టిస్తున్న సంగతి తెలిసిందే. 

కోట్లకొద్దీ పెట్టుబడులను వెచి్చంచడం ద్వారా దేశీయంగా ఈకామర్స్‌ మార్కెట్‌ను భారీగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2030కల్లా ఈకామర్స్‌ మార్కెట్‌ 21 శాతం వార్షిక వృద్ధితో 325 బిలియన్‌ డాలర్లకు చేరనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. తాజా పెట్టుబడులతో అమెజాన్‌ దేశవ్యాప్తంగా అవకాశమున్న పిన్‌కోడ్‌లకు సరీ్వసులను విస్తరించాలని భావిస్తోంది. ఇందుకు కొత్త ప్రాంతాలలో వేర్‌హౌస్‌ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్నవాటిని ఆధునీకరించడం, డెలివరీ నెట్‌వర్క్‌ను వేగవంతం చేయడం తదితర సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది.  

Advertisement
 
Advertisement
Advertisement