స్పెక్ట్రం కేటాయింపులు.. వ్యతిరేకించిన ఎయిర్‌టెల్‌!

Airtel Opposes Spectrum Auction - Sakshi

న్యూఢిల్లీ: శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రం కేటాయింపు విషయంలో టెలికం సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వేలం మార్గంలో కేటాయించాలని రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) సూచించగా, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం వ్యతిరేకించింది. స్పెక్ట్రం కేటాయింపులకు వేలం పారదర్శక విధానం కాగలదని జియో అభిప్రాయపడింది.

 దీనివల్ల ఎటువంటి టెక్నాలజీని వాడాలనేది సర్వీస్‌ ప్రొవైడర్లు నిర్ణయించుకునేందుకు కూడా వీలవుతుందని పేర్కొంది. 2012 నాటి సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పెక్ట్రంను పారదర్శకంగా వేలం వేయాలని వీఐఎల్‌ తెలిపింది. 

అయితే, అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే దేశీ సంస్థలకు ఈ విధానం ప్రతికూలంగా ఉంటుందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. శాట్‌కామ్‌ స్పెక్ట్రం కేటాయింపులపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రూపొందించిన చర్చాపత్రంపై టెల్కోలు, పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలను తెలియజేశాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top