
ఇటీవల టెలికాం రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. దీంతో ఒకటి కంటే ఎక్కువ మొబైల్ నంబర్లను వినియోగిస్తున్నవారికి మరింత భారంగా మారింది. పెద్ద డేటా ప్యాకేజీలు కాకుండా తమ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకుంటే చాలని కొంతమంది యాజర్లు భావిస్తున్నారు. మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయి ఇటువంటి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే..
ఎయిర్‌టెల్ వివిధ వర్గాల వినియోగదారుల అవసరాలను తీర్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల శ్రేణిని అందిస్తోంది. పెద్ద మొత్తంలో డేటా అవసరం లేకుండా తక్కువ ధరలో నెలవారీ రీఛార్జ్ కోసం చూస్తున్నవారికి, రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు లాంగ్ వాలిడిటీని అందించే ప్లాన్లు సుమారు రూ .200 వద్ద ఎయిర్‌టెల్‌లో ఉన్నాయి. ఆ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లు ఏవో ఇక్కడ పరిశీలిద్దాం.
రూ.211 ప్లాన్
ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 1 జీబీ లభిస్తుంది. అంటే 30 రోజులకు మొత్తం 30 జీబీ లభిస్తుందన్నమాట. అయితే ఇందులో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే ఇది డేటా ఓన్లీ ప్లాన్. బ్రౌజింగ్, సోషల్ మీడియా లేదా ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాల కోసం ప్రధానంగా మొబైల్ డేటాను ఉపయోగించేవారికి ఈ ప్లాన్ అనువైనది.
రూ .219 ప్లాన్
డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు రెండింటినీ కోరుకునే వినియోగదారులకు ఎయిర్‌టెల్ రూ .219 ప్రీపెయిడ్ ప్లాన్ మంచి ఎంపిక. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీని అందిస్తుంది. నెల మొత్తం 3 జీబీ డేటాను అందిస్తుంది. నెలంతా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఆనందించవచ్చు.
ఎలా రీచార్జ్ చేసుకోవాలి?
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల కోసం రీఛార్జ్ చేసుకోవడం చాలా సులభం. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా నేరుగా మీ ఎయిర్‌టెల్ నంబర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లోనూ, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి పాపులర్ థర్డ్ పార్టీ రీఛార్జ్ యాప్‌లలో కూడా ఈ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment