ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా? | Sakshi
Sakshi News home page

Chandrayaan-3: ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా?

Published Thu, Sep 14 2023 9:42 AM

AI Imagen Chandrayaan 3 Lander Photos - Sakshi

చంద్రుని దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన 'చంద్రయాన్-3' గురించి దాదాపు అందరికి తెలిసిందే. ప్రారంభంలో అక్కడి సమాచారాన్ని చాలావరకు భూమిపైకి పంపిన ల్యాండర్, రోవర్ రెండూ కూడా ప్రస్తుతం స్లీపింగ్‌ మోడ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఇవి అక్కడ ఎలా ఉంటాయనే సన్నివేశం ఊహించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించారు.

ఏఐ ఊహాజనిత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రస్తుతం చంద్రుని మీద చీకటి ఉన్న కారణంగా అవి నిద్రలోకి జారుకున్నాయి. చంద్రుడి సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టె సమయం 28 రోజులు, కావున అక్కడ 14 రోజులు చీకటి, మరో 14 రోజులు వెలుతురు ఉంటుంది.

ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు!

ఏఐ ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడి పరిసరాలు మొత్తం గ్రీన్ క‌ల‌ర్‌లో.. దాని మధ్యలో ల్యాండర్ ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం చంద్రుని మీద ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా గడ్డకట్టేంత ఉంటాయని, ఇలాంటికివన్నీ రోవర్ తట్టుకోగలదా అనేది ప్రశ్నార్థకం. అయితే ఈ నెల 22న పగటి సమయం మొదలవుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే ల్యాండర్ అండ్ రోవర్ మళ్ళీ పరిశోధనలు మొదలుపెడతాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement