మానవత్వం.. మంటగలిసిన వేళ, ఎయిరిండియాపై తీవ్ర విమర్శలు

80 Year Old Dies At Mumbai Airport For Wheelchair Air India  Request Delay - Sakshi

మానవత్వం మంటగలిసింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పరోక్షంగా ఓ ప్రయాణికుడు ప్రాణం పోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది.  

పలు నివేదికల ప్రకారం.. అమెరికా న్యూయార్క్‌ నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ 80 ఏళ్ల ప్రయాణికుడు కుప్పకూలాడు. ఆపై ప్రాణాలొదిలాడు. అయితే ఈ విషాదానికి ముందు ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌ ప్రదేశం నుంచి టెర్మినల్‌ వరకు సుమారు.1.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడు సదరు ప్రయాణికుడు.

వయో భారం దృష్ట్యా ల్యాండింగ్‌ తర్వాత ఎయిరిండియా సిబ్బందిని తనకు వీల్‌ చైర్‌ ఇవ్వాలని కోరాడు. కానీ వీల్‌ చైర్‌ కొరత ఉండడంతో తాము ఇవ్వలేమని తిరస్కరించారు. చేసేది లేక కిలోమీటర్‌ దూరం నడుచుకుంటూ టెర్మినల్‌కు చేరుకున్న ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదంతో ప్రయాణికుల పట్ల ఎయిరిండియా సిబ్బంది వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ తరుణంలో ఎయిరిండియా యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటికే తాము బాధితుడి భార్యకు వీల్‌ ఛైర్‌ కేటాయించామని, తనకూ మరో వీల్‌ ఛైర్‌ కావాలని కోరడంతో.. ప్రయాణికుల రద్ది కారణంగా వీల్‌ ఛైర్‌ ఇచ్చేందుకు కొద్ది సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని కోరినట్లు తెలిపింది. కానీ ప్రయాణికుడు మాత్రం తన భార్యతో కలిసి నడుచుకుంటూ టెర్మినల్‌లోకి వచ్చినట్లు వెల్లడించింది.   

ప్రయాణికుడు టెర్మినల్‌లో స్పృహ కోల్పోయిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి చెందిన మెడికల్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, నిమిషాల వ్యవధిలో స్థానిక ఆస్పత్రికి తరలిచారు. అప్పటికే ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎయిరిండియా యాజమాన్యం వివరణ ఇచ్చింది.

చదవండి👉 : ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్‌ మీల్స్‌లో చికెన్‌ ముక్కలు’!

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top