‘వెజ్‌ మీల్స్‌లో చికెన్‌ ముక్కలు’.. నమ్మకాన్ని పోగొట్టుకుంటున్న ఎయిరిండియా?

Air India Passenger Finds Chicken In Veg Meal - Sakshi

టాటా స‌న్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు.  

టాటా సన్స్‌ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్‌- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. 

 

తాజాగా, మరో మహిళ వెజ్‌మీల్స్‌లో చికెన్‌ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్‌జైన్‌ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్‌ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎ‍క్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్‌ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది.  

వీర్‌జైన్‌కు 
జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్‌జైన్‌ వెజ్‌మీల్స్‌ ఆర్డర్‌ చేసింది. సిబ్బంది వెజ్‌మీల్స్‌ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్‌లో మీల్స్‌ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్‌పై ‘వెజ్ మెయిన్‌ మీల్‌’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్‌ పీసెస్‌ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్‌ సూపర్‌వైజర్‌ సోనాని ప్రశ్నించింది. వీర్‌జైన్‌తో పాటు తన స్నేహితురాలు   సైతం తన వెజ్‌ ప్లేట్‌లో చికెన్‌ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. 

పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది?
అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు
ప్రస్తుతం ఆఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్‌బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్‌ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్‌ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది.

చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్‌ సింఘానియా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top