చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం తెలుసా.. | 50 Percentage Export Duty On Molasses | Sakshi
Sakshi News home page

చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం తెలుసా..

Jan 19 2024 11:22 AM | Updated on Jan 19 2024 11:23 AM

50 Percentage Export Duty On Molasses - Sakshi

ప్రస్తుత సీజన్‌‌లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో చెరకు నుంచి తీసే ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన మొలాసిస్‌‌పై ప్రభుత్వం 50 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ నిబంధనలు జనవరి 18 నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయ డిస్టిలరీల కోసం మొలాసిస్‌ను అందుబాటులో ఉంచడం, పెట్రోల్‌, డీజిల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుత సంవత్సరంలో పెట్రోల్‌‌లో 15 శాతం ఇథనాల్‌‌ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మళ్లింపు లేకపోవడం వల్ల 2023-24 సీజన్‌‌లో (అక్టోబర్-సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి  37.3 మిలియన్ టన్నుల నుంచి 32.3-33 మిలియన్ టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తలిపింది.

ఇదీ చదవండి: రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే..

వియత్నాం, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్  ఫిలిప్పీన్స్‌‌తో సహా ఇతర దేశాలకు భారతదేశం మొలాసిస్‌‌ను ఎగుమతి చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్  రాష్ట్రాలు మొలాసిస్‌‌ను ఎగుమతి చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement