● దుమ్ముగూడెంలో 200 బస్తాలను పట్టుకున్న అటవీశాఖ అధికారులు ● ఇప్పటికే 12 టన్నులను జిల్లా సరిహద్దులు దాటించిన సిండికేట్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏజెన్సీలో నయా దందాగా మారిన అల్లివేర్ల అక్రమ రవాణా గుట్టురట్టయింది. దుమ్ముగూడెం మండలం ములకపాడులో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దాచిన రెండు వందల బస్తాల వేర్లను దుమ్ముగూడెం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల శనివారం మధ్యాహ్నం పట్టుకుని సీజ్ చేశారు. కె.రామకృష్ణ, బి నాగేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తులపై ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేశారు. ఒక్కో బస్తాలో 50కేజీలవరకు వేర్లు ఉన్న ట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. స్థానికంగా ఈ వేర్లు కేజీ రూ.50కి లభిస్తాయని, మధ్యవర్తులు, దళారులు పెరిగే కొద్దీ కేజీ విలువ వందకు పై మాటగానే ఉంటుందని వెల్లడించారు.
ఆరు నెలలుగా..
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మాలతోపాటు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో అల్లిచెట్టు (ఐరన్‌ఉడ్) వేర్ల అక్రమ రవాణా ఆరు నెలలుగా కొనసాగుతోంది. గొత్తికోయగూడేలకు చెందిన అమాయక గిరిజ నులకు మాయమాటలు చెప్పి టన్నుల కొద్దీ వేర్లను తెప్పిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో వేర్వేరు చోట్ల దాటి ఉంచుతున్నారు. ఈ నెల 5 నాటికి సుమారు 15 టన్నుల వేర్లను ఇలా దాచి ఉంచారు. అప్పటి నుంచి విడతల వారీగా సుమారు 12 టన్నుల సరుకును మినీ ట్రక్కుల్లో జిల్లా సరి హద్దులు దాటించి ఏపీలోకి, అక్కడి నుంచి తమిళనాడు కు అక్రమంగా చేరవేశారు. అల్లిచెట్టు వేర్ల అక్రమ రవాణాపై వారం రోజులుగా ‘సాక్షి’లో వరుస కథనాలు వస్తున్నాయి. దీంతో ఈ అక్రమ దందాపై నజర్ పెట్టక తప్పని పరిస్థితి ఫారెస్ట్ శాఖ కు ఎదురైంది. చివరకు పక్కా సమాచారంతో దుమ్ముగూడెంలో సుమారు రూ.10లక్షల విలువ చేసే వేర్లను పట్టుకున్నారు. తెలంగాణ సరిహద్దులోని సుక్మా, బీజాపూర్ జిల్లాలోనూ భారీ ఎత్తున అల్లి చెట్టు వేర్ల నిల్వలు ఉన్నట్టు సమాచారం. కేవలం సుక్మా జిల్లా పాలాచలంలోనే రెండు వందల బస్తాలకు పైగా అల్లిచెట్టు వేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
ధీమాగా సిండికేట్
చర్ల మండలానికి చెందిన ముగ్గురు, దుమ్ముగూడెం మండలానికి చెందిన ఏడుగురు వ్యక్తులు రెండు సిండికేట్లుగా మారి దందాను నడిపిస్తున్నారు గతంలో టేకు, జిట్రేగి, మద్ది వంటి చెట్ల కలప అక్రమ రవాణా కేసులు సైతం వీరిపై ఉన్నాయి. నాలుగైదేళ్లుగా సాధారణ జీవితం గడిపిన వీరు ఈ ఏడాదిలో కేవలం నెలల వ్యవధిలోనే లక్షలరూపాయల విలు వైన స్థిర, చర ఆస్తులు ఎడాపెడా కొనేయడం స్థాని కంగా చర్చనీయాంశంగా మారింది. గత జూలై 7న తెలంగాణ–ఛత్తీగఢ్ సరిహద్దులోని మారాయిగూడెం గ్రామంలో అల్లి చెట్టు వేర్ల అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. అప్పుడే సిండికేట్ వ్య వహారాలు తొలిసారిగా వెలుగు చూశాయి. అయి తే, ఆ సమయంలో సిండికేట్ వ్యక్తులపై కేసులు నమోదు కాలేదు. దీన్ని అలుసుగా తీసుకుని అడవికి మరింత చేటుచేశారు. సిండికేట్ ఎడాపెడా చెట్లను నరికేస్తూ టన్నుల కొద్దీ వేర్లను పోగేయడం మొదలుపెట్టింది. స్థానికంగా ఎవరైనా ప్రశ్నిస్తే బెది రించడం పరిపాటిగా మారింది. ఇప్పటికై నా సిండికేట్‌లోని కీలక వ్యక్తులపై ఫారెస్టు, పోలీసు శాఖలు దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా రు. సిండికేట్‌కు లోపాయికారిగా సహకరిస్తున్న ఇంటిదొంగలకు చెక్‌పెట్టాలని అటవీశాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు.


