రుద్రంపూర్: కొత్తగూడెం రీజియన్ పరిధి ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగురు ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు 5.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ కచ్చితంగా తొలగించాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో జీఎంలకు దిశానిర్దేశం చేశారు. సంస్థవ్యాప్తంగా 12 ఏరియాల్లో రోజుకు 14.15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగిస్తేనే నిత్యం 2.45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని అన్నారు.
బదిలీలు నిలిపివేయాలని వినతి
కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం నుంచి సత్తుపల్లి ఏరియాకు అధికారులు, క్లరికల్ సిబ్బంది బదిలీలను నిలిపివేయాలని జీఎం పర్సనల్ (ఐఆర్‌పీఎం) జీవీ కిరణ్‌కుమార్‌కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, సాగర్, క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు.


