పెండింగ్‌లో ఉన్న హమాలీ చార్జీల
వివరాలు (రూ.లక్షల్లో)
● హమాలీ చార్జీలు చెల్లించని ప్రభుత్వం ● రైతులకు రూ.6 కోట్ల వరకు బకాయి
పాల్వంచరూరల్: ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా హమా లీ చార్జీలు చెల్లించకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. ఏటా సీజన్లు మారుతున్నా సర్కారు నిర్లక్ష్యం వీడటంలేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తొలుత హమాలీ చార్జీలు చెల్లిస్తే, తర్వాత రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసేది. క్వింటాల్‌కు రూ.5.10 చొప్పున 2016 వరకు చెల్లించింది. ఆ తర్వాత చెల్లించడంలేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు క్వింటాల్‌కు రూ. 40 నుంచి రూ.50 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.5.10లే ఇస్తోంది. అది కూడా కొన్నేళ్లుగా ఇవ్వకపోవడంతో రూ.6కోట్ల మేర బకాయి పేరుకుపోయింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన హమాలీ చార్జీలు పెండింగ్‌లో ఉండగా, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావడం లేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఏడాది ఖరీఫ్ రబీ
2017–18 40.97 11.40
2018–19 85.27 7.83
2019–20 64.94 30.20
2020–21 72,66 36.06
2021–22 52.17 10.82
2022–23 58.49 18.56
2023–24 3.27 02.19
2024–25 57.63 28.17
2025–26 07.98 23.02


