భద్రాచలంటౌన్: శ్రీసీతారామ చంద్రస్వామి వారి నిత్యకల్యాణం శనివారం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా మిథిలా స్టేడియం ప్రాంగణంలోని రామసేవా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
గ్రంథాలయ
వారోత్సవాలు ప్రారంభం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథా లయ వారోత్సవాలను ప్రారంభించారు. చాచా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్ జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, గీతా లాపానలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయాలను సద్వినియో గం చేసుకుంటూ కథలు, విజ్ఞానదాయకమైన పుస్తకాలు చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ ఎం.సరిత, గ్రంథాలయ కార్యదర్శి కె.కరుణకుమారి, గ్రేడ్–2 గ్రంథపాలకులు ఎస్.లలిత కుమారి, జి. మణిమృదుల, సీహెచ్. శ్రీనివాస్, నాగన్న, రవి, మధుబాబు, వాణి పాల్గొన్నారు.
వ్యవసాయ డ్రోన్ శిక్షణకు అవకాశం
భద్రాచలంటౌన్: ఆధునిక వ్యవసాయ సాంకేతికతను యువతకు అందించేందుకు భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట వైటీసీల్లో వ్యవసాయ డ్రోన్ శిక్షణ ప్రారంభించినట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రోన్లతో పురుగుమందులు పిచికారీ ద్వారా రైతులకు సమయం, ఖర్చు, శ్రమ తగ్గుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల యువతీ, యువకులు వైటీసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
దమ్మపేట: సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసిత రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరి ష్కరిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. శనివా రం మండల పరిధిలోని గండుగులపల్లిలోని మంత్రి నివాసంలో ఆయనను మొండివర్రె గ్రామ పరిధిలోని సీతారామ ప్రాజెక్ట్ పదో ప్యా కేజీ నిర్వాసిత రైతులు కలిశారు. ప్రాజెక్ట్ భూ సేకరణ, పరిహారం, పునరావాస సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయాలనివినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు కాసాని నాగప్రసాద్,దొడ్డాప్రసాద్ పాల్గొన్నారు.
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించారు.


